ఇకపై 'తక్కువ' ధరలకు విక్రయం కుదరదు.. యూఏఈలో కొత్త పోటీ చట్టం
- July 12, 2024
యూఏఈ: ఇతర కంపెనీలను పోటీ నుండి తరిమికొట్టడానికి అతి తక్కువ ధరలను అందించడం యూఏఈలో ఇక కుదరదు.ఈ మేరకు యూఏఈలో కొత్త పోటీ చట్టం వచ్చింది. ఇది చాలా తక్కువ ధరలకు వస్తువులను విక్రయించాన్ని నిషేధిస్తోంది. వినియోగదారుల ప్రయోజనాలకు హాని కలిగించకుండానే న్యాయమైన పోటీ ఉండేలా చూస్తోంది. అన్ని కంపెనీలకు గుత్తాధిపత్య విధానాలను నిషేధించడం, దేశంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. న్యాయమైన పోటీ పద్ధతులను నిర్ధారించడానికి తనిఖీల కోసం మంత్రిత్వ శాఖ స్థానిక అధికారులతో కలిసి పర్యవేక్షించనుంది. అయితే, చట్టాన్ని ఉల్లంఘించే కంపెనీలకు జరిమానాలను కేబినెట్ సమీక్షించిన అనంతరం వెల్లడిస్తామని ఆర్థిక మంత్రిత్వ శాఖ అండర్ సెక్రటరీ అబ్దుల్లా అహ్మద్ అల్ సలేహ్ తెలిపారు.
తాజా వార్తలు
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్పోర్ట్కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం
- చార్లెట్ లో వైభవంగా NATS తెలుగు సంబరాలు
- సౌదీ అరేబియాలోని తమ పౌరులు అప్రమత్తంగా ఉండాలని భారత్ సూచన
- విజయవాడలో గాంధీ శిల్ప బజార్ ప్రారంభం
- శ్రీనగర్ చేరుకున్న ఎంపీ బాలశౌరి..
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్లో కొత్త సీజన్ ప్రారంభం.. 20 కోట్ల పూలతో కనువిందు!
- రస్ అల్ ఖైమాలో విషాదం.. కనిపించకుండా పోయిన మహిళ మృతి..!!
- ఆసియన్ స్కూల్లో ఘనంగా ‘ఏక్తా 2026’ వేడుకలు..!!
- సౌదీలో 20 మందికి పైగా కార్మికులున్న సంస్థలకు షేర్డ్ హౌసింగ్ తప్పనిసరి..!!







