కువైట్‌లో బానుడి భగభగలు..వారాంతంలో 52-53 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

- July 12, 2024 , by Maagulf
కువైట్‌లో బానుడి భగభగలు..వారాంతంలో 52-53 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు

కువైట్: కువైట్‌లోని కొన్ని కువైట్ ప్రాంతాలలో వారాంతంలో పగటిపూట ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు మించి ఉంటుందని కువైట్ వాతావరణ కేంద్రం  ప్రకటించింది. వాయువ్య గాలుల ప్రభావంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నాయని సెంటర్ డైరెక్టర్ జనరల్ అబులాజీజ్ అల్-ఖరావి తెలిపారు.  అయితే రాత్రి వేళల్లో 32 నుంచి 34 డిగ్రీల మధ్య వేడి ఉంటుందన్నారు. శుక్రవారం నాడు వాయువ్య గాలుల తీవ్రత కారణంగా ఉష్ణోగ్రతలు 49-53 డిగ్రీల స్థాయికి పెరుగుతుందని హెచ్చరించారు. శనివారం కూడా పగటి ఉష్ణోగ్రతలు 48-50 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంటుందన్నారు.     

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com