100 దేశాల్లో ఆర్ట్ అఫ్ లివింగ్ యోగాడే వేడుకలు
- June 14, 2016
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారత్‌తో పాటు మరో వంద దేశాల్లో నిర్వహించనున్నట్లు ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్ ఆధ్వర్యంలోని ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) సంస్థ ప్రకటించింది. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం నిర్వహించనున్నారు. బ్రస్సెల్స్‌లోని యూరోపియన్ పార్లమెంట్లో యోగాడే వేడుకలను రవిశంకర్ స్వయంగా ప్రారంభించనున్నారు.
ప్రఖ్యాత యహూది మెనుహిన్ హాల్లో పార్లమెంటేరియన్ల చేత ఆయన ధ్యానం తదితర కార్యక్రమాలు చేయించనున్నారు. అలాగే వాషింగ్టన్ డీసీ, బోస్టన్, కొలంబస్, మిన్నెసోటా, శాన్ఫ్రాన్సిస్కో, పోర్ట్‌ల్యాండ్, సియాటెల్ తదితర ప్రాంతాల్లో కూడా ఆయన యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారని ఏఓఎల్ ఓ ప్రకటన విడుదల చేసింది.
దిల్లీలో నిర్వహించే యోగా కార్యక్రమంలో 20వేల మంది పాల్గొననున్నారని, ముంబయిలో నాలుగు వేదికల్లో 16,500 మంది పాల్గొంటారని తెలిపింది. ముంబయిలో బోరివాలి ఈస్ట్‌లో జూన్ 19, కార్టర్ రోడ్, బాంద్రా, ఖాండివిలి వెస్ట్‌లోని పోయిసర్ జిమ్ఖానా, నవీముంబయిల్లో జూన్ 21న ఏఓఎల్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు
- దుబాయ్‌లో ఘనంగా ‘ఇసుక తిన్నెల పై బతుకమ్మ’ పాట ఆవిష్కరణ
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!







