ప్రైవేటు సంస్థలకు 'సర్వైలెన్స్‌' తప్పనిసరి

- June 14, 2016 , by Maagulf
ప్రైవేటు సంస్థలకు 'సర్వైలెన్స్‌' తప్పనిసరి

సర్వైలెన్స్‌ కెమెరాలను ప్రైవేటు విద్యా సంస్థలు, కమర్షియల్‌, ఇండస్ట్రియల్‌ మరియు చారిటీ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌, ఇతర ప్రైవేటు సంస్థలకు తప్పనిసరి చేస్తూ బహ్రెయిన్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల్లోగా ఈ సర్వైలెన్స్‌ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మే 23న ఇంటీరియర్‌ మినిస్టర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ షేక్‌ రషిద్‌ బిన్‌ అబ్దుల్లా అల్‌ ఖలీఫా ఈ రిజల్యూషన్‌ని విడుదల చేశారు. జూన్‌ 9న గెజిట్‌లో ఈ రిజల్యూషన్‌ చేర్చబడింది. సర్వైలెన్స్‌ కెమెరాలు ఇరవై నాలుగ్గంటలూ పనిచేయాల్సి ఉంటుంది. అలాగే 120 రోజుల వీడియో రికార్డింగ్‌ని ఇందులో పొందుపర్చాలి. అత్యవసర సందర్భాల్లో జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సివిల్‌ డిఫెన్స్‌ వర్గాలకు ఈ 120 రోజుల వీడియో రికార్డింగ్‌ని అందివ్వాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా వీడియోలను బహిర్గతం చేయడం, ట్రాన్స్‌ఫర్‌ చేయడం, స్టోరేజ్‌ చేయడం నేరం. బెడ్రూమ్‌లు, ఫిజియోథెరపీ రూమ్‌లు, రెస్ట్‌ రూమ్స్‌, చేంజింగ్‌ రూమ్స్‌ మరియు మహిళలకు కేటాయించిన ప్రైవేటు రూమ్‌లలో వీటి వినియోగం కూడా నేరమే. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com