ప్రైవేటు సంస్థలకు 'సర్వైలెన్స్' తప్పనిసరి
- June 14, 2016
సర్వైలెన్స్ కెమెరాలను ప్రైవేటు విద్యా సంస్థలు, కమర్షియల్, ఇండస్ట్రియల్ మరియు చారిటీ ఎస్టాబ్లిష్మెంట్స్, ఇతర ప్రైవేటు సంస్థలకు తప్పనిసరి చేస్తూ బహ్రెయిన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆరు నెలల్లోగా ఈ సర్వైలెన్స్ కెమెరాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. మే 23న ఇంటీరియర్ మినిస్టర్ లెఫ్టినెంట్ జనరల్ షేక్ రషిద్ బిన్ అబ్దుల్లా అల్ ఖలీఫా ఈ రిజల్యూషన్‌ని విడుదల చేశారు. జూన్ 9న గెజిట్‌లో ఈ రిజల్యూషన్ చేర్చబడింది. సర్వైలెన్స్ కెమెరాలు ఇరవై నాలుగ్గంటలూ పనిచేయాల్సి ఉంటుంది. అలాగే 120 రోజుల వీడియో రికార్డింగ్‌ని ఇందులో పొందుపర్చాలి. అత్యవసర సందర్భాల్లో జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ డిఫెన్స్ వర్గాలకు ఈ 120 రోజుల వీడియో రికార్డింగ్‌ని అందివ్వాల్సి ఉంటుంది. అనుమతి లేకుండా వీడియోలను బహిర్గతం చేయడం, ట్రాన్స్ఫర్ చేయడం, స్టోరేజ్ చేయడం నేరం. బెడ్రూమ్లు, ఫిజియోథెరపీ రూమ్‌లు, రెస్ట్ రూమ్స్, చేంజింగ్ రూమ్స్ మరియు మహిళలకు కేటాయించిన ప్రైవేటు రూమ్‌లలో వీటి వినియోగం కూడా నేరమే.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







