యూఏఈలో కొత్త క్యాబినెట్..ఉప ప్రధానిగా షేక్ హమ్దాన్
- July 15, 2024
యూఏఈ: దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ ఆదివారం రక్షణ మంత్రిగా నియమితులయ్యారు. దీంతోపాటు షేక్ హమ్దాన్ బిన్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ యూఏఈ ఉప ప్రధానమంత్రిగా కూడా వ్యవహరించనున్నారు.యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి మరియు దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ఫెడరల్ ప్రభుత్వంలో భారీ మార్పులను ప్రకటించారు. షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ తన విదేశాంగ మంత్రి పాత్రను సమర్థవంతంగా నిర్వహించడంతో ఉప ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు.
యూఏఈలో విద్యాశాఖ మంత్రిగా సారా అల్ అమీరీ నియమితులయ్యారు. ఆమె గతంలో పబ్లిక్ ఎడ్యుకేషన్ అండ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిగా ఉన్న డాక్టర్ అబ్దుల్ రెహ్మాన్ అల్ అవార్, ఉన్నత విద్య మరియు శాస్త్రీయ పరిశోధనల తాత్కాలిక మంత్రిగా కూడా వ్యవహరిస్తారు. విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన అహ్మద్ బెల్హౌల్ ఇప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖకు సేవలు అందించనున్నారు. అలియా అబ్దుల్లా అల్ మజ్రూయి వ్యవస్థాపకత శాఖ సహాయ మంత్రిగా నియమితులయ్యారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







