ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు.. రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

- July 15, 2024 , by Maagulf
ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు.. రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్: ఇల్లు లేని వారికీ రేవంత్ సర్కార్ తీపి కబురు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గ్రామ సభలు నిర్వహించి ఎంపిక చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమాచారం. తొలి దశలో సొంత స్థలం ఉన్న వారికి ఆర్థికసాయం, రెండో దశలో స్థలం లేని వారికి స్థలంతో పాటు ఆర్థికసాయం అందజేయనుందట. తొలి దశలో నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున మంజూరు చేస్తుంది. ఇంటి నిర్మాణానికి లబ్ధిదారులకు రూ. 5లక్షలను 3 విడతల్లో వారి ఖాతాల్లో జమ చేయనుంది.

ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున ఏడాదికి 4.5 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ప్రజాపాలనలో 82.82 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే వీరిలో అర్హులను గుర్తించటం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. పేదరికంలో ఉన్న వారికే ఇళ్లు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దరఖాస్తులు ఇచ్చిన వారి ఆర్థిక స్తోమతను గుర్తించడం సవాలేనని అధికారులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com