ఏపీలో మరో కొత్త చట్టం..!

- July 16, 2024 , by Maagulf
ఏపీలో మరో కొత్త చట్టం..!

అమరావతి: ఏపీలో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. తాము భూ యజమానులం అని కబ్జాదారులే నిరూపించుకోవాలని వెల్లడించారు. భవిష్యత్తులో భూమి కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ను గుజరాత్ లో అమలు చేస్తున్నారని తెలిపారు. అదే తరహాలో ఏపీలోనూ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. భూ హక్కు పత్రం పేరుతో ప్రచారానికి వైసీపీ రూ.13 కోట్లు ఖర్చు చేసిందని చంద్రబాబు ఆరోపించారు. భూముల రీ సర్వే పేరుతో జగన్ చిత్రం ముద్రించుకున్నారని, ల్యాండ్ టైటిలింగ్ చట్టం మేరకు ప్రైవేట్ వ్యక్తులను నియమించవచ్చని తెలిపారు.

ఎంతో అహంభావంతో జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఆ చట్టం దురుద్దేశాలను ప్రజలు గహించారన్న సీఎం చంద్రబాబు.. అందుకే ఎన్నికల్లో వైసీపీకి బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ఒకసారి తమ భూములను చెక్ చేసుకోవాలని ప్రజలకు సూచించారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఎవరూ అధైర్య పడొద్దని, ధైర్యంగా ఫిర్యాదు చేయాలన్నారు. కబ్జా చేసిన వారు ఎంతటి వారైనా ఉపేక్షించేబోమని తేల్చి చెప్పారు ముఖ్యమంత్రి చంద్రబాబు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com