ఉక్రెయిన్-రష్యా యుద్ధం..భారత్‌కు మరోసారి అమెరికా విజ్జప్తి
- July 16, 2024
వాషింగ్టన్: ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించేలా రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్‌తో మాట్లాడాలని భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా విజ్ఞప్తి చేసింది. ఈ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించేలా కృషి చేయాలని కోరింది.
భారత్-రష్యా బంధం సుదీర్ఘమైనదని ఈ సందర్భంగా గుర్తు చేసింది. ఈ క్రమంలో మాస్కో కైవ్ మధ్య జరుగుతున్న యుద్ధానికి ముగింపు పలికేలా భారత్ జోక్యం చేసుకోవాలని కోరింది. ఇందుకు తన దీర్ఘకాల సంబంధాన్ని ఉపయోగించుకోవాలని సూచించింది.
ఈ మేరకు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… ఢిల్లీ-మాస్కోల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో యూఎన్ చార్టర్‌ను గౌరవించాలని పుతిన్‌కు చెప్పాలని కోరారు. పుతిన్ చట్టవిరుద్ధమైన యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు. ఉక్రెయిన్ ప్రాదేశిక సమగ్రతను, సార్వభౌమత్వాన్ని గౌరవించమని పుతిన్‌కు సూచించాలని మిల్లర్ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష
- ఏపీలో వేసవిని తలపిస్తున్న ఎండలు
- కల్తీ మద్యం తాగి 14 మంది మృతి..
- ISRO ప్రైవేటీకరణపై క్లారిటీ ఇవ్వండి
- సౌదీ-మలేషియా జాయింట్ ఆపరేషన్.. డ్రగ్ నెట్వర్క్ బస్ట్..!!
- హవల్లీ, ముబారక్ అల్-కబీర్ ప్రాంతాల్లో పలుచోట్ల పవర్ కట్..!!
- కతారా హాస్పిటాలిటీ.. హోటళ్లు, రిసార్టుల్లో 40 శాతం వరకు ఆదా..!!
- దుబాయ్ హోటల్ ధరలకు రెక్కలు..175 శాతం వరకు పెంపు..!!







