చంద్రుడిపై భారీ గుహను గుర్తించిన ఇటలీ సైంటిస్టులు
- July 16, 2024
చంద్రుడిపై ఓ భారీ గుహను గుర్తించినట్లు ఇటలీ సైంటిస్టులు చెప్పారు. నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ కాలుమోపిన ప్రాంతానికి దగ్గర్లోనే ఈ భారీ గుహ ఉందని చెప్పారు.
చంద్రుడిపై పర్వతాలు, లోయలు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించిన అంతరిక్ష పరిశోధకులు తాజాగా గుహ వున్నట్లు గుర్తించినట్లు ఇటలీ సైంటిస్టులు తెలిపారు. సోలార్ రేడియేషన్, కాస్మిక్ కిరణాల నుంచి ఆస్ట్రోనాట్లకు ఇవి రక్షణ కల్పిస్తాయని వివరించారు.
అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ 55 ఏళ్ల క్రితం చంద్రుడిపై కాలుమోపిన సంగతి తెలిసిందే. ఆర్మ్ స్ట్రాంగ్ దిగిన చోటు నుంచి దాదాపు 400 కిలోమీటర్ల దూరంలో ఈ బిలాన్ని గుర్తించామని ఇటలీ సైంటిస్టుల బృందం నిర్ధారించింది.
అగ్నిపర్వతం వెదజల్లిన లావా కారణంగా ఈ బిలం ఏర్పడి ఉంటుందని సైంటిస్టులు చెప్పారు. ఈ గుహ వెడల్పు కనీసం 40 మీటర్లు ఉంటుందని, పొడవు మరింత ఎక్కువగా ఉండొచ్చని పేర్కొన్నారు.
భూమిపై ఉన్నట్లుగానే చంద్రుడిపైనా భారీ గుహలు ఉండొచ్చని అంతరిక్ష పరిశోధకులు భావిస్తున్నారు. దాదాపు 50 ఏళ్లుగా కొనసాగిన ఈ మిస్టరీని తమ బృందం ఛేదించిందని ఇటలీ పరిశోధకులు వివరించారు. ప్రస్తుతానికి ఒక గుహను మాత్రమే కనుగొన్నప్పటికీ చంద్రుడిపై పదులు, వందల సంఖ్యలో గుహలు ఉంటాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







