సీనియర్ నటులంత మాకు ఇన్స్పిరేషన్ : ఎన్టీఆర్
- June 14, 2016
ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన సినీ'మా' అవార్డ్స్‌లో భాగంగా 'టెంపర్' చిత్రానికి యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా అవార్డ్ అందుకున్నాడు. ఈ అవార్డుని అందుకున్న ఎన్టీఆర్ మాట్లాడుతూ...'' ఈ అవార్డుని అందించిన స్టార్ ఇండియా సినీ'మా'అవార్డ్స్ వారికి నా ధన్యవాదాలు. చిరంజీవి గారి చేతుమీదుగా నాగార్జున గారి చేతుల మీదుగా ఈ అవార్డుని అందుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. మాకు ఎన్నేళ్లు వచ్చినా..మా అందరికీ ఇన్స్పిరేషన్ మాత్రం చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు, నందమూరి తారకరామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణగారే. వారి ఆశీర్వచనాలు మా యంగ్ జనరేషన్‌కి ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను'' అంటూ వేదిక దిగబోయాడు ఎన్టీఆర్.
ఇంతలో యాంకర్‌గా వ్యవహరిస్తున్నసుమ ఒక ప్రశ్న అంటూ.. తారక్ నీ జీవితంలో వచ్చిన పెద్ద మార్పేమిటని అడగగా.. 'నా కొడుకు' అంటూ జవాబిచ్చాడు యంగ్ టైగర్.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









