వ్యాయామానికి ముందు శిరోజాలకు రక్షణ..
- June 14, 2016
వ్యాయామం చేస్తున్నప్పుడు జుట్టుకి చెమటపడుతుంది. ముందురోజు తలస్నానం చేసినా కూడా జుట్టు జీవం లేనట్లు కనిపిస్తుంది. ఈ సమస్య నివారణకు ఇలా చేయండి..
*
వ్యాయామానికి ముందు తలకు లైవ్-ఆన్ సీరమ్ రాసుకోండి. ఇది చెమట నుంచి శిరోజాలకు రక్షణగా నిలుస్తుంది. వ్యాయామం అయ్యాక మామూలుగా కడిగేసుకుంటే సరిపోతుంది.
*
తలకు సంబంధించిన ప్యాక్ ఏదయినా సరే.. వ్యాయామం చేసే ముందు వేసుకుని తలను ముడిలా చుట్టేసుకోండి. వ్యాయామం పూర్తయ్యాక చల్లటి నీళ్లతో కడిగేయాలి. పెరుగూ, టీ డికాక్షన్, గుడ్డు తెల్లసొనా.. ఇలా దేన్నయినా వాడొచ్చు.
*
చాలామంది జుట్టు గట్టిగా ముడివేసుకునే వర్కవుట్లు చేయడానికి ప్రయత్నిస్తుంటారు.
ఇది పొరపాటు. ఇందువల్ల చెమట ఎక్కువగా పట్టడమే కాదు, జుట్టు చిట్లిపోతుంది కూడా. కాబట్టి కాస్త వదులుగా జడ వేసుకోవాలి. మీది పోనీటెయిల్ అయితే.. తలకు హెయిర్‌బ్యాండ్ పెట్టుకున్నా సరిపోతుంది.
*
చెమట పడుతోంది కదాని.. రోజూ షాంపూతో తలస్నానం చేయాలని చూడకండి. దానివల్ల జుట్టు పొడిబారుతుంది. రోజు మార్చి రోజు తలస్నానం చేయాలి. ఒకవేళ మరీ తప్పదనిపిస్తే కొద్దిగా డ్రై షాంపూ తీసుకుని కుదుళ్లకు పట్టించి తరవాత కడిగేసుకుంటే చాలు. చెమట సమస్య వదలడమే కాదు.. తల్లో మురికి ఉన్నా పోతుంది.
*
ఆరుబయట వ్యాయామం చేస్తున్నప్పుడూ ఎండ ప్రభావం జుట్టుపై పడుతుంది. పొడిబారడం, జుట్టు చివర్లు చిట్లడం లాంటి సమస్యలు ఎదరుకావచ్చు. అందుకే ఎస్పీఎఫ్ ఉన్న ఉత్పత్తి ఏదైనా తలకు రాసుకోవడం మంచిది.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







