బతువా ఆకు గురించి మీకీ విషయాలు తెలుసా.?

- July 18, 2024 , by Maagulf
బతువా ఆకు గురించి మీకీ విషయాలు తెలుసా.?

ఆకుకూరలు అనేక రకాలు. తోటకూర, గోంగూర, పాలకూర.. ఇలా అనేక రకాల ఆకుకూరలున్నాయ్. ఏ ఆకుకూర అయినా ఆరోగ్యానికి ఎంతో కొంత మేలు చేస్తుంది ఖచ్చితంగా. అయితే, ఈ ఆకుకూరతో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలున్నాయ్.

అదేంటంటారా.? బతువా ఆకు. దీన్నే పప్పు కూర అని కూడా పిలుస్తారు. ఈ ఆకు కూరలో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువగా వుంటుంది. క్యాలరీలు తక్కువగా వుండడం వల్ల కొలెస్ర్టాల్ తగ్గించుకుని బరువు తగ్గాలనుకునే వారికి ఈ ఆకుకూర బెస్ట్ ఆప్షన్ అని నిపుణులు చెబుతున్నారు.

పంటి చిగురు వాపులు, దంతాల సమస్యలు ఈ ఆకు కూరను వట్టిగానే నమలడం వల్ల తగ్గుతాయ్. రక్తాన్ని శుద్ధి చేయడంలో బతువా ఆకు సమర్ధవంతంగా పని చేస్తుంది. అందుకే చర్మ సమస్యలకు ఈ ఆకుకూర చాలా మంచిది. చర్మంపై ఎలాంటి రేషెస్ వచ్చినా, మరే ఇతర స్కిన్ డిసీజెస్‌కి అయినా బతువా ఆకు మంచి పరిష్కారం.

రేషెస్ వున్న చోట ఈ ఆకును పేస్ట్‌లా చేసి పూస్తే సరిపోతుంది. అలాగే దీర్ఘ కాలంగా వుండే గాయాలు కూడా మానిపోతాయ్. ఈ ఆకు రసం రోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల మలబద్ధకం సమస్యలు తీరతాయ్. ఏ ఇతర జీర్ణ సమస్యలున్నా ఉపశమనం కలుగుతుంది.

మల, మూత్ర విసర్జన అవయవాల వద్ద దురద (ఇచ్చింగ్) వంటి అసౌకర్యాలున్నా ఈ ఆకు రసం బాగా పని చేస్తుంది. అలాగే కిడ్నీ, కాలేయ సమస్యలకు కూడా ఈ ఆకుకూర చాలా మంచిది. ప్రతీ రోజూ కాకపోయినా అప్పుడప్పుడూ అయినా ఈ ఆకుకూరల్ని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com