త్వరలో రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తాం - మంత్రి నారాయణ
- July 18, 2024
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్నా క్యాంటీన్లను ఆగష్టు 15 తేదీన ప్రారంభిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. 2. 25 లక్షల మంది అన్నార్తుల ఆకలి తీర్చేలా వీటిని మొదలు పెడుతున్నాం..
మొత్తం 203 క్యాంటీన్లను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాం.. గత ప్రభుత్వ హాయంలో అన్నిటినీ గోదాములుగా, సచివాలయాలుగా, బ్లీచింగ్ నిల్వ కేంద్రాలుగా వాడుకున్నారు.. అన్నా క్యాంటీన్ల నిర్వహణకు టెండర్లను పిలిచాం.. గతంలో అక్షయపాత్ర ఫౌండేషన్ రుచికరమైన భోజనం అందించింది.. అదే రూ. 5 చొప్పున భోజనం, టిఫిన్లను అందిస్తాం.. ఎక్కడా ధర పెంచడం లేదు అని మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు.
ఇక, రాష్ట్ర వ్యాప్తంగా డయేరియా వ్యాప్తి చెందుతోంది అని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. 106 మున్సిపాలిటీలు, 17 కార్పొరేషన్లలో మురుగు కాల్వలు సిల్టు తీయమని ఆదేశాలు జారీ చేశాం.. కార్పొరేషన్లు మినహా 106 మున్సిపాలిటీల్లో డ్రెయిన్లల్లో సిల్ట్ తీసేందుకు 50 కోట్ల రూపాయలను ఇచ్చాం.. సిల్ట్ తీయడంతో పాటు 24 గంటల్లో దాన్ని తరలించాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. సిల్ట్ తీసి డ్రయిన్ దగ్గరే ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటాం.. చెత్త పన్ను అంశంపై సీఎంతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటాం.. గతంలో ఆస్తి పన్ను భారీగా పెంచారు.. 2014- 19 మధ్య ఎలాంటి ఆస్తి పన్నులను పెంచలేదు.. అన్ని అంశాలపై సమీక్ష చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమ్మంలో సీఎం రేవంత్ హాట్ అనౌన్స్మెంట్, అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్!
- రేపు భారత్ లో పర్యటించనున్న యూఏఈ అధ్యక్షుడు
- న్యూజెర్సీ శ్రీ శివ విష్ణు దేవాలయంలో ‘నారీ శక్తి’ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం
- ఖతార్ లో విద్యార్థులకు 4వేల ఫ్రీ, రాయితీ సీట్లు..!!
- సౌదీలో స్కూల్స్ రీ ఓపెన్.. 92 వర్కింగ్ డేస్..!!
- Dh50,000 వివాహ గ్రాంట్..దుబాయ్ బిలియనీర్ ఆఫర్..!!
- కువైట్ లో లా నినా ఎఫెక్ట్.. టెంపరేచర్స్ పెరుగుతాయా?
- నిజ్వాలో అగ్నిప్రమాదం..భయంతో ప్రజలు పరుగులు..!!
- ట్యాక్సీ డ్రైవర్ పై దాడి.. BD220, ఫోన్స్ చోరీ..!!
- దుబాయ్లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి







