సింగపూర్‌లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..
- July 20, 2024
సింగపూర్: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్..తన భార్య అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొనడానికి సింగపూర్ వెళ్లారు. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ నుంచి పవన్ భార్య అన్నా లెజినోవా ఇవాళ ‘మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్’ పట్టా పొందారు. ఆ వర్సిటీ స్నాతకోత్సవానికి పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. యూనివర్సిటీలో పీజీ పట్టా అందుకున్నాక పవన్ తో కలిసి అన్నా లెజినోవా ఫొటోలు దిగినట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న పవన్ కల్యాణ్ ఇవాళ సింపుల్‌గా ఫార్మల్ లుక్ లో కనపడడం అభిమానులను అలరిస్తోంది.
ఇటీవల పవన్, అన్నా లెజినోవా ఎయిర్‌పోర్టులో కనపడ్డారు. అన్నాను పవన్ కల్యాణ్ 2013లో పెళ్లి చేసుకున్నారు. పవన్ కల్యాణ్ కొన్ని వారాల క్రితమే ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన సినిమాల్లో తక్కువగా నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన నటించిన ఓజీ, హరిహర వీరమల్లు సినిమాలు విడుదల కావాల్సి ఉంది.
తాజా వార్తలు
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!
- ఒమన్ లో చిన్నారిని రక్షించిన రెస్క్యూ టీమ్..!!
- బహ్రెయన్ లో బీభత్సం సృష్టించిన వర్షాలు..!!
- ఎంపీలకు తేనీటి విందు ఇచ్చిన స్పీకర్ ఓం బిర్లా..
- డిసెంబర్ 31లోపు ఈ పనులు చేయకపోతే భారీ జరిమానా!
- తిరుమల వెళ్లే భక్తులకు ఆర్టీసీ శుభవార్త







