యూఏఈలో నిరసనలు..బంగ్లాదేశీయులు అరెస్ట్..విచారణ
- July 21, 2024
యూఏఈ: స్వదేశంలోని తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టినందుకు అరెస్టు చేసిన బంగ్లాదేశ్ జాతీయుల బృందంపై తక్షణ దర్యాప్తునకు యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూష ఆదేశించింది.వారు బహిరంగ సభ పెట్టి అశాంతిని కలిగించే ఉద్దేశ్యంతో, చట్టాలు మరియు నిబంధనల అమలును నిరోధించడం మరియు అడ్డుకోవడం, వ్యక్తులకు అంతరాయం కలిగించడం, వారి హక్కులను అడ్డుకోవడం, ట్రాఫిక్‌కు ఆటంకం కలిగించడం మరియు ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆస్తులకు నష్టం కలిగించడం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైందని పేర్కొంది. నిరసన కరులు ఉద్దేశపూర్వకంగా రవాణాకు అంతరాయం కలిగించారని, వీడియోలను రికార్డ్ చేసి వాటిని ఆన్లైన్లో అప్లోడ్ చేశారని వెల్లడించారు. ఈ చర్యలు రాష్ట్ర భద్రత, పబ్లిక్ ఆర్డర్‌కు ముప్పు కలిగిస్తాయని, రాష్ట్ర ప్రయోజనాలకు హాని కలిగిస్తాయని, తదుపరి విచారణ ప్రారంభించడంతో వారిని అదుపులోకి తీసుకున్నట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్, కౌన్సెలర్ డాక్టర్ హమద్ అల్ షమ్సీ తెలిపారు. నిందితులను త్వరితగతిన విచారణకు సూచించాలని ఆదేశించారు. దేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ దాని చట్టాలకు కట్టుబడి ఉండాలని ఆయన కోరారు.
ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం కోరిన సివిల్ సర్వీస్ ఉద్యోగాల కోసం ప్రిఫరెన్షియల్ హైరింగ్ నిబంధనలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జరిగిన నిరసనల్లో కనీసం 39 మంది మరణించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







