ఐటీ ఉద్యోగుల పని గంటలు పెంపు
- July 21, 2024
బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని ఐటీ సహా ప్రైవేటు సంస్థలు, పరిశ్రమల్లో 50 శాతం నుంచి వంద శాతం వరకు స్థానికులకే రిజర్వేషన్ కల్పించాలని ఆ రాష్ట్ర కేబినెట్ ఇటీవల ఓ బిల్లును ఆమోదించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకునే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఐటీ ఉద్యోగుల పని వేళలను రోజుకు 10 గంటల నుంచి 14 గంటలకు పొడిగించాలని కర్ణాటక ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. దీని కోసం కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, 1961ని సవరించాలని చూస్తోంది.ఐటీ రంగ సంఘాల నుంచి దీనిపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
తాజా ప్రతిపాదన ప్రకారం ఐటీ, ఐటీఈఎస్, బీపీఓ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు రోజులో 12 గంటలకు మించి పనిచేసేందుకు కొత్త బిల్లు అనుమతిస్తుంది. రోజులో గరిష్ఠంగా 14గంటల చొప్పున పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం ఎక్కువ గంటలతో కలిపి గరిష్ఠంగా 10గంటలు మాత్రమే పనిచేయించేందుకు అనుమతి ఉంది. అయితే వరుసగా మూడునెలల్లో ఉద్యోగితో 125 గంటలకు మించి అదనపు గంటలు పని చేయించకూడదు. ఐటీ ఉద్యోగుల పనిగంటల పెంపు ప్రతిపాదనలు వచ్చాయని, ఆ విషయమై ఇంకా చర్చలు జరుగుతున్నట్లు కర్ణాటక కార్మిక శాఖ మంత్రి మీడియాకు తెలిపారు. పనిగంటల పెంపుపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదన్నారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







