ICRF థర్స్ట్-క్వెన్చర్స్ 2024 ఈవెంట్.. కార్మికులకు అవగాహన
- July 21, 2024
మనామా: ICRF థర్స్ట్ క్వెన్చర్స్ 2024 మూడవ ఈవెంట్ హిద్ లోని వర్క్‌సైట్‌లో జరిగింది. ఇండియన్ కమ్యూనిటీ రిలీఫ్ ఫండ్ (ICRF) థర్స్ట్-క్వెన్చర్స్ 2024 బృందం తన వార్షిక వేసవి అవగాహన కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని, జూలై మరియు ఆగస్టులలో సురక్షితమైన పని వాతావరణాన్ని నిర్ధారించడానికి కార్మిక మంత్రిత్వ శాఖ చొరవకు అనుగుణంగా కార్యక్రమాలను చేపడుతున్నట్లు వెల్లడించారు. జూలై, ఆగస్టులో, ICRF వారి పని ప్రదేశాలలో కార్మికులకు బాటిల్ వాటర్, లాబాన్ మరియు పండ్లను పంపిణీ చేస్తుంది. తీవ్రమైన వేసవి వేడి కారణంగా ఎక్కువగా ప్రభావితమైన వారిని లక్ష్యంగా ప్రోగ్రామ్స్ నిర్వహిస్తుంటారు. హిద్ కార్యక్రమంలో సుమారు 250 మంది కార్మికులు పాల్గొన్నారు. రాబోయే 10 వారాల పాటు వివిధ వర్క్‌సైట్‌లలో కార్యక్రమాలు కొనసాగుతాయిన ICRF థర్స్ట్-క్వెన్చర్స్ టీమ్ వెల్లడించింది.
తాజా వార్తలు
- చిరంజీవికి ‘జీవిత సాఫల్య పురస్కారం’..
- ఫార్ములా 1 రేస్.. జెడ్డా, మక్కా, తైఫ్లో స్కూళ్లకు సెలవులు..!!
- యూఏఈలో 18 క్యారెట్ల గోల్డ్ జ్యువెలరీకి ఫుల్ డిమాండ్..!!
- బహ్రెయిన్ మంత్రితో సమావేశమైన భారత రాయబారి..!!
- రష్యా-ఉక్రెయిన్ సంక్షోభం.. దౌత్య ప్రయత్నాలను స్వాగతించిన ఖతార్..!!
- 919 దిగుమతి చేసుకున్న మద్యం సీసాలు.. నలుగురు అరెస్టు..!!
- అల్ దఖిలియాకు పోటెత్తిన టూరిస్టుల..పర్యాటక ప్రదేశాల్లో రద్దీ..!!
- హైదరాబాద్ విమానాశ్రయం నుండి వియెట్నాం, హో చి మిన్కు విమాన సేవలు ప్రారంభం
- తెలంగాణలో మెక్డొనాల్డ్స్ గ్లోబల్ సెంటర్.. !
- ఏపీ: విశాఖ, విజయవాడ మెట్రోకు కేంద్రం నిధులు విడుదల !