క్రౌడ్‌స్ట్రైక్ గ్లిచ్.. 2 రోజుల్లో 10 విమానాలు రద్దు

- July 21, 2024 , by Maagulf
క్రౌడ్‌స్ట్రైక్ గ్లిచ్.. 2 రోజుల్లో 10 విమానాలు రద్దు

యూఏఈ: గత రెండు రోజులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు, రిటైలర్లు  గ్లోబల్ టెక్నాలజీ లోపం కారణంగా ఇబ్బందులు పడుతున్నాయి. యూఏఈలో మొత్తం 10 విమానాలు రద్దు చేయబడ్డాయని అధికారులు తెలిపారు. ఏవియేషన్ అనలిటిక్స్ కంపెనీ సిరియమ్ డేటా ప్రకారం.. జూలై 20న ప్రపంచవ్యాప్తంగా 986 విమానాలు రద్దు కాగా, అందులో యూఏఈకి చెందిన ఆరు విమానాలు ఉన్నాయి.అలాగే జూలై 19న 975 విమానాలలో నాలుగు యూఏఈ విమానాలు రద్దయినట్లు తెలిపింది. గ్లోబల్ టెక్నికల్ అంతరాయం యూఏఈపై స్వల్ప ప్రభావం చూపిందని జనరల్ సివిల్ ఏవియేషన్ అథారిటీ (GCAA) తెలిపింది.   

టెర్మినల్స్ 1 మరియు 2 వద్ద కొన్ని ఎయిర్‌లైన్‌ల చెక్-ఇన్ ప్రక్రియపై ప్రభావం చూపిన సిస్టమ్ అంతరాయం కారణంగా విమాన కార్యకలాపాలను వేగంగా తిరిగి ప్రారంభించినట్లు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్ తెలిపింది.  కాగా, రెండు రోజుల్లో అమెరికా, ఆస్ట్రేలియా, ఇండియా, స్పెయిన్, కెనడా, ఇటలీ, యూకే, జర్మనీ దేశాలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. క్రౌడ్‌స్ట్రైక్ గ్లిచ్ అమెరికా,  డెల్టా, యునైటెడ్, అమెరికన్, స్పిరిట్, అలాస్కా, ఫ్రాంటియర్, హవాయి, సౌత్‌వెస్ట్, జెట్‌బ్లూ మరియు అల్లెజియంట్ వంటి ఇతర పాశ్చాత్య క్యారియర్‌లను ప్రభావితం చేసింది. అదేవిధంగా, ఆసియా మరియు యూరోపియన్ విమానయాన సంస్థలు కూడా ప్రభావితమయ్యాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com