నాని హీరోయిన్‌కి బాలయ్య ఛాన్స్ ఇచ్చాడు కానీ.!
- July 22, 2024
నేచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ సినిమాలో హీరోయిన్‌గా నటించిన ముద్దుగుమ్మ శ్రద్ధా శ్రీనాధ్ గుర్తుందిగా. ఆ సినిమా ప్రమోషన్లలో ఈ అమ్మడు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.. ‘పేరు గుర్తుందిగా శ్రద్ధా శ్రీనాధ్..’ అంటూ తనను తాను తెగ ప్రమోట్ చేసుకుందీ మలయాళ ముద్దుగుమ్మ.
నిజానికి విషయమున్న నటే. కానీ, తెలుగు మేకర్లు ఎందుకో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత వెంకటేష్ హీరోగా వచ్చిన ‘సైంధవ్’ సినిమాలో నటించింది. అయినా కానీ, పెద్దగా అవకాశాలు దక్కించుక్ోలేకపోయింది.
తమిళ, మలయాళ చిత్రాల్లో మంచి అవకాశాలు దక్కించుకుందీ అందాల బొమ్మ. అలాగే, ఆయా డబ్బింగ్ సినిమాలతో తెలుగులోనూ కొంత సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది కూడా.
ఇక, తాజాగా శ్రద్ధా శ్రీనాధ్ పేరు మళ్లీ వినిపిస్తోంది. బాబీ డైరెక్షన్‌లో బాలయ్య నటిస్తున్న సినిమాలో మొదట శ్రద్ధా శ్రీనాధ్ పేరు వినిపించింది. కొన్ని సీన్లు కూడా ఈమెపై చిత్రీకరించారనీ సమాచారమ్.
అయితే, తాజాగా ఆ ప్రాజెక్ట్ నుంచి శ్రద్ధా పేరును డిలీట్ చేసి, ఆ ప్లేస్‌ని ప్రగ్యా జైశ్వాల్‌తో రీప్లేస్ చేశారనీ తెలుస్తోంది. ఇందులో నిజమెంతో తెలీదు కానీ, బాలయ్య ఛాన్సిచ్చినా పాపం ఈ ముద్దుగుమ్మకి ఆ చాన్స్ దక్కలేదనేది టాక్.
అయితేనేం, యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న కొత్త సినిమాలో శ్రద్ధా శ్రీనాధ్ పేరు వినిపిస్తోంది.
తాజా వార్తలు
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!







