బిగ్‌బాస్ హంగామా కలర్ ఫుల్‌గా స్టార్టయ్యిందిగా.!
- July 22, 2024
బుల్లితెర గేమ్ షో బిగ్‌బాస్ హంగామా త్వరలో స్టార్ట్ కానుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయం ఇంకా క్లారిటీ లేదు కానీ, త్వరలోనే స్టార్ట్ అవుతుందన్న విషయం రివీల్ చేశారు తాజాగా నిర్వాహకులు.
బిగ్‌బాస్ లోగోని రిలీజ్ చేశారు. ‘ఎంటర్టైన్మెంట్ తీసుకొచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా..’ అంటూ కొత్త లోగోను రిలీజ్ చేశారు.
లోగో కలర్ ఫుల్‌గా వుంది. రెస్సాన్స్ బాగుంది. గత కొన్ని రోజులుగా బిగ్‌బాస్ సెలబ్రిటీలు వీళ్లు.. వాళ్లు.. అంటూ ట్రెండింగ్‌లో వున్న కొన్ని పేర్లను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు.
పరువు హత్యకి సంబంధించి వైరల్ అయిన అమృతను ఈ సారి బిగ్‌బాస్‌లోకి తీసుకొస్తున్నారట అంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే రేవ్ పార్టీ ఇష్యూతో ట్రెండింగ్ అయిన నటి హేమ, అలాగే కొందరు ట్రెండింగ్ యూ ట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్.
ఫైనల్‌గా వీళ్లలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేవాళ్లెందరో తెలియాలంటే షో స్టార్ట్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.
You have been waiting for it, we have been waiting for it, everybody we know has been waiting for it!
— Starmaa (@StarMaa) July 21, 2024
Yes, BIGG BOSS IS BACK!!!
Presenting the epic new logo of Season Eight! #BiggBossTelugu8 @DisneyPlusHSTel pic.twitter.com/etqTK1PT4o
తాజా వార్తలు
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!
- అవయవదానంతో 12 మందికి పునర్జన్మ.. నలుగురు చిన్నారులకు కొత్త జీవితం..!!
- అమెరికా–ఇరాన్ ఘర్షణలు తీవ్రం..
- కువైట్ గగనతలంలో క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న వైమానిక రక్షణ వ్యవస్థలు
- సోనమ్ వాంగ్‌చుక్ నిరాహార దీక్ష భగ్నం..!







