అశ్విన్ బాబు భారీగానే ప్లాన్ చేశాడుగా
- July 22, 2024
‘‘రాజుగారి గది’ సిరీస్ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న హీరో అశ్విన్ బాబు. టీవీ యాంకర్ కమ్ ఫిలిం మేకర్ అయిన ఓంకార్‌కి సోదరుడైన అశ్విన్ బాబు కెరీర్లో ‘రాజు గారి గది’ సినిమాలు తప్ప చెప్పుకోదగ్గ సక్సెస్లేమీ లేవు.
‘రాజుగారి గది’ కోసం దెయ్యాల కాన్సెప్ట్ తీసుకుంటే, తాజాగా శివుడి నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్నాడు అశ్విన్ బాబు. అదే ‘శివం భజే’. సైలెంట్‌గా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 1 ని రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
అప్సర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో దిగంగన సూర్యవంశీ హీరోయిన్గా నటిస్తోంది. ఆల్రెడీ రిలీజ్ చేసిన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
విజువల్స్ బాగున్నాయ్. క్వాలిటీ కూడా రిచ్‌గా కనిపిస్తోంది. పరమేశ్వరుడి రూపాన్ని రివీల్ చేయలేదు కానీ, డివైన్ వైబ్స్ స్క్రీన్‌పై అదిరిపోయేలా వుండబోతున్నాయని హింట్ ఇచ్చారు.
ఫుల్ ఆఫ్ యాక్షన్ మరియు ఆధ్యాత్మిక కళ కనిపిస్తోంది ఈ సినిమాలో. చూడాలి మరి, ఈ సినిమాతోనైనా అశ్విన్ బాబు బౌన్స్ బ్యాక్ అవుతాడేమో చూడాలి మరి.
తాజా వార్తలు
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!







