బిగ్‌బాస్ హంగామా కలర్ ఫుల్‌గా స్టార్టయ్యిందిగా.!

- July 22, 2024 , by Maagulf
బిగ్‌బాస్ హంగామా కలర్ ఫుల్‌గా స్టార్టయ్యిందిగా.!

బుల్లితెర గేమ్ షో బిగ్‌బాస్ హంగామా త్వరలో స్టార్ట్ కానుంది. ఎప్పుడు స్టార్ట్ అవుతుందన్న విషయం ఇంకా క్లారిటీ లేదు కానీ, త్వరలోనే స్టార్ట్ అవుతుందన్న విషయం రివీల్ చేశారు తాజాగా నిర్వాహకులు.

బిగ్‌బాస్ లోగోని రిలీజ్ చేశారు. ‘ఎంటర్‌టైన్‌మెంట్ తీసుకొచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా..’ అంటూ కొత్త లోగోను రిలీజ్ చేశారు.

లోగో కలర్ ఫుల్‌గా వుంది. రెస్సాన్స్ బాగుంది. గత కొన్ని రోజులుగా బిగ్‌బాస్ సెలబ్రిటీలు వీళ్లు.. వాళ్లు.. అంటూ ట్రెండింగ్‌లో వున్న కొన్ని పేర్లను ప్రచారంలోకి తీసుకొస్తున్నారు.

పరువు హత్యకి సంబంధించి వైరల్ అయిన అమృతను ఈ సారి బిగ్‌బాస్‌లోకి తీసుకొస్తున్నారట అంటూ ప్రచారం జరుగుతోంది. అలాగే రేవ్ పార్టీ ఇష్యూతో ట్రెండింగ్ అయిన నటి హేమ, అలాగే కొందరు ట్రెండింగ్ యూ ట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయ్.

ఫైనల్‌గా వీళ్లలో హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చేవాళ్లెందరో తెలియాలంటే షో స్టార్ట్ అయ్యే వరకూ వెయిట్ చేయాల్సిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com