ముద్రగడ దీక్ష ఏడో రోజుకు చేరింది

- June 14, 2016 , by Maagulf
ముద్రగడ దీక్ష ఏడో రోజుకు చేరింది

 తుని ఘటనలో అరెస్టులకు నిరసనగా మాజీ మంత్రి ముద్రగడ్డ పద్మనాభం చేపట్టిన దీక్ష ఏడో రోజుకు చేరింది. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్న ఆయన బుధవారం ఉదయం కూడా రక్తపరీక్షలకు అంగీకరించలేదని వైద్యవిధాన పరిషత్‌ సమన్వయ అధికారి డాక్టర్‌ రమేశ్‌ కిషోర్‌ తెలిపారు. రెండు గంటలకోసారి బీపీ పరీక్షించడానికి ముద్రగడ అంగీకరించినట్లు వెల్లడించారు. బీపీ 130/80 ఉందని, ఈ రోజు సాయంత్రం లోపు కుటుంబ సభ్యుల సహకారంతో వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. ముద్రగడ భార్య, కోడలికి వైద్యం అదిస్తున్నామని వైద్యులు తెలిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com