కళ్లు దురదల సమస్య నుంచి ఉపశమనం పొందడం ఎలా.?
- July 22, 2024
మానవ శరీరంలోని ప్రధానమైన అవయవాల్లో కళ్లు కూడా ఒకటి. కళ్లు చాలా సున్నితమైనవి. వీటిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే, ఆయా సీజన్లను బట్టి అప్పుడప్పుడూ కొందరిలో కంటి సమస్యలు తలెత్తుతుంటాయ్.
అందులో ముఖ్యంగా చెప్పుకోదగ్గవి కంటి దురదలు. కళ్లు పొడిబారడం వల్ల కంటి దురదలు తలెత్తుతుంటాయ్. వాటి నుంచి తప్పించుకోవాలంటే ప్రతిరోజూ కళ్లను శుభ్రం చేసుకుంటూ వుండాలి.
ఇలా చేయడం వల్ల కంటిలోని బాక్టీరియాని తొలిగించి కళ్లను ఆరోగ్యంగా వుంచుకోవచ్చు. సరైన నిద్ర లేకపోవడం వల్ల కూడా కంటి దురదలకు ఓ కారణంగా చెబుతున్నారు.
అందుకే కళ్లకు సరైన విశ్రాంతి అవసరమని నిపుణులు చెబుతున్నారు. కంటి దురదలు తలెత్తినప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ ఎక్కువగా వుండడం వల్ల చెడు బ్యాక్టీరియా నాశనమవుతుంది.
కళ్లు దురదలు అతిగా బాధిస్తున్నప్పుడు ఐ డ్రాప్స్ వాడొచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల అది కంటికి ల్యూబ్రికెంట్ ఏజెంట్‌గా పని చేస్తుంది. తద్వారా ఈ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.
మగవారిలో ఆల్కహాల్, స్మోకింగ్ కూడా కంటి దురదలకు ఓ కారణంగా చెబుతున్నారు. కంటి దురదల సమస్య వున్నప్పుడు వాటికి దూరంగా వుండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తాజా వార్తలు
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ
- ప్రభుత్వ AI ఇండెక్స్..సౌదీ అరేబియా నెంబర్ వన్..!!
- స్మార్ట్ఫోన్ యూజర్స్ ను హెచ్చరించిన కేంద్ర ప్రభుత్వం
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన







