‘మహానటి‘ కీర్తి సురేష్ కొత్త సినిమా వివాదమేంటో
- July 22, 2024
మహానటిగా బోలెడంత ఖ్యాతి దక్కించుకున్న ముద్దుగుమ్మ కీర్తి సురేష్. ఈ సినిమాతో అమాంతం కీర్తి సురేష్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత స్టార్ హీరోల సరసన నటించింది.
అలాగే హీరోయిన్ సెంట్రిక్ మూవీస్‌తోనూ ఆకట్టుకుంది కీర్తి సురేష్. అయితే, కొన్ని హీరోయిన్ సెంట్రిక్ మూవీస్ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయ్.
అయినా కానీ, మహానటి ఇమేజ్‌కి డ్యామేజ్ ఏమీ రాలేదు సరికదా.. మరిన్ని లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు కీర్తి సురేష్ పేరు పరిశీలనలు జరుగుతూనే వున్నాయ్.
తాజాగా ‘రఘు తాత’ అనే ఓ ఇంట్రెస్టింగ్ మూవీ సిద్ధమవుతోంది. ఈ సినిమాని తెలుగు, తమిళంతో పాటూ, ఇతర భాషల్లోనూ సిద్ధం చేస్తున్నారు.
అయితే, తాజాగా ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలూ, డైలాగులూ పొలిటికల్‌గా దుమారం రేపేవిగా వుండబోతున్నాయనీ.. ఆ విషయమై ఒకింత వివాదం రచ్చ రేపుతోంది.
అయితే, కీర్తి సురేష్ మాత్రం ఈ సినిమాలో వివాదం లాగేంత అవసరం ఏమీ లేదనీ, అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా ఆలోచింపచేసేలా ఈ సినిమా వుండబోతోందనీ చెబుతోంది.
ఓ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అనీ చెబుతోంది. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నట్లు బాలీవుడ్‌లోనూ ఓ సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోంది. తమిళ బ్లాక్ బస్టర్ ‘తెరి’ మూవీకి హిందీ రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి: గవర్నర్ హరిబాబు
- పలు దేశాల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్ నిషేధం
- రికార్డు సృష్టించిన స్మృతి మంధాన
- దుబాయ్‌లో ‘ఎన్టీఆర్ సజీవ చరిత్ర’ పుస్తకావిష్కరణ
- మస్కట్ నైట్స్ 2026 జనవరిలో ప్రారంభం..!!
- కువైట్ లో వీసా కోసం..ఆరోగ్య బీమా రుసుములు పెంపు..!!
- బహ్రెయిన్ కాఫీ ఫెస్టివల్లో విజయం..నేపాలీ బారిస్టాస్ కు సత్కారం..!!
- సౌదీ, జోర్డాన్ విదేశాంగ మంత్రులు భేటీ..!!
- మ్యాచ్ ఫర్ హోప్ 2026..యూట్యూబ్ స్టార్ మిస్టర్‌బీస్ట్ ఖరారు..!!
- షేక్ హమ్దాన్ ను కలిసిన ఎలోన్ మస్క్..!!







