ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీతో ముగిసిన సీఎం రేవంత్ రెడ్డి భేటీ..
- July 22, 2024
న్యూ ఢిల్లీ: రెండ్రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏఐసీసీ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజాగా అమలు చేసిన రైతు రుణమాఫీ సహా పలు అంశాలపై చర్చించారు.రుణమాఫీ మూడు దఫాలుగా ఇవ్వనున్నామని, మెదటి విడతలో భాగంగా రూ.6వేల కోట్లతో రూ.లక్ష లోపు రుణాలు మాఫీ చేసినట్లు రాహుల్కు ముఖ్యమంత్రి వివరించారు. ఈ నెలాఖరున నిర్వహించే వరంగల్ కృతజ్ఞతా సభకు రావాలంటూ రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు.
సమావేశం అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను మర్యాదపూర్వకంగా కలిసినట్లు డిప్యూటీ సీఎం చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల హామీల్లో భాగంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీల అమలు తీరును వారికి వివరించినట్లు భట్టి చెప్పుకొచ్చారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ, గ్యాస్ సబ్సిడీ, ఉచిత కరెంటు, రైతు రుణమాఫీ హామీల అమలుతీరు విధానాన్ని అగ్రనేతలకు వివరించామని తెలిపారు.
గతంలో గ్యాస్ కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే ఖాతాదారుల అకౌంట్లలో సబ్సిడీ పడేదన్నారు. ప్రస్తుతం దీని కోసం ప్రభుత్వ ఖాతాలో ముందుగానే రూ.10 కోట్లు డిపాజిట్ చేసినట్లు వివరించినట్లు చెప్పారు. రూ.500రూపాయలకే సిలిండర్ ఇస్తున్నామని, భవిష్యత్తులో రైతులకు రూ.2లక్షల రుణమాఫీ చేయబోతున్నట్లు చెప్పామన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసి తెలంగాణ పీసీసీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశామన్నారు. రాహుల్ గాంధీని త్వరలో రాష్ట్రానికి రావాలని ఆహ్వానించినట్లు డిప్యూటీ సీఎం భట్టి చెప్పుకొచ్చారు.
తాజా వార్తలు
- సీఈసీ, ఎన్నికల కమిషనర్లకు చట్టపరమైన మినహాయింపుపై సుప్రీంకోర్టు నోటీసులు
- మా ఓటమికి ఇరాన్ యుద్ధమే కారణం..అయినా వెనక్కి తగ్గను: డోనాల్డ్ ట్రంప్
- ఉపాధి హామీ పని దినాలపై కేంద్రానికి సీఎం చంద్రబాబు రిక్వెస్ట్
- మిడిలిస్ట్ లో ఉద్రిక్తతలపై సౌదీ, సిరియా కీలక పిలుపు..!!
- దుబాయ్లో అద్దె చెల్లించని వ్యాపారికి షాక్..!!
- లండన్ లో ఒమన్ పర్యాటక ప్రత్యేకతల ప్రదర్శన..!!
- బహ్రెయిన్ – ఇరాక్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చలు..!!
- ఖతార్లో మోటోజీపీ 2026.. ప్రేక్షకుల కోసం గైడ్ లైన్స్ విడుదల..!!
- కువైట్లో ఘనంగా ‘దీపావళి దివానియా’ వేడుకలు..!!
- మలేషియా: తెలుగు ఎక్స్పాట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ బ్యాడ్మింటన్ టోర్నమెంట్







