ఫోన్ నెంబ‌ర్ లేకుండానే వాట్సాప్ ఛాటింగ్‌..

- July 22, 2024 , by Maagulf
ఫోన్ నెంబ‌ర్ లేకుండానే వాట్సాప్ ఛాటింగ్‌..

ఫోన్ నెంబ‌ర్ లేకుండానే ఇక నుంచి వాట్సాప్ వాడుకునే సౌక‌ర్యం అందుబాటులోకి రానున్న‌ది. యూజ‌ర్‌నేమ్‌లు క్రియేట్ చేసి..ఇత‌రుల‌తో వాట్సాప్ చాటింగ్ చేసుకునే రీతిలో కొత్త ఫీచ‌ర్‌ను డెవ‌ల‌ప్ చేస్తున్నారు. వాబెటాఇన్‌ఫో దీనిపై ఓ రిపోర్టును ప్ర‌చురించింది.ఈ కొత్త త‌ర‌హా ఫీచ‌ర్ ఫ్లాట్‌ఫామ్‌కు చెందిన ఇంట‌ర్‌ఫేస్ డిజైన్‌ను రూపొందిస్తున్న‌ట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

వాట్సాప్ యూజ‌ర్ల ప్రైవ‌సీకి ప్రాముఖ్య‌త‌ను ఇస్తూ ఈ కొత్త ఫీచ‌ర్‌ను డెవల‌ప్ చేస్తున్నారు. యూజ‌ర్ ఫ్రొఫైల్ ద్వారా మ‌న‌కు కావాల్సిన వారిని వాట్సాప్‌లో గుర్తించేందుకు ఈ కొత్త త‌ర‌హా ప్ర‌య‌త్నాన్ని చేప‌డుతున్నారు.కేవ‌లం ఐడెంటిటీ తెలిసిన‌వారు లేదా ఫోన్ నెంబ‌ర్ తెలిసిన‌వారు మాత్ర‌మే ఈ కొత్త త‌ర‌హా ఫీచ‌ర్‌ను వాడుకునే ఛాన్సు ఉంటుంది.

ఫోన్ నెంబర్లు షేర్ చేయ‌కుండానే..యూజ‌ర్ నేమ్ ద్వారా క‌నెక్ట్ అయ్యే వాట్సాప్ ఫీచ‌ర్ త్వ‌ర‌లోనే అందుబాటులోకి రానున్న‌ది.వాట్సాప్ వెబ్ పేజీ కోసం కూడా ఈ ఫీచ‌ర్‌ను త‌యారు చేస్తున్నారు. యూజ‌ర్ల ప్రైవ‌సీ కోసం.. ఫోన్ నెంబ‌ర్ల బ‌దులుగా కేవ‌లం యూజ‌ర్ నేమ్‌ను వాడ‌నున్నారు. మీ యూజ‌ర్‌నేమ్ తెలిసిన‌వారు మీతో క‌నెక్ట్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ది.ఫోన్ నెంబ‌ర్ షేర్ చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌నివారు..యూజ‌ర్‌నేమ్ ద్వారా క‌నెక్ట్ అయ్యేందుకు ఇదో అద‌న‌పు ఫీచ‌ర్ కానున్న‌ది.

ఈ ప‌ద్ధ‌తి ద్వారా ప‌ర్స‌న‌ల్ ఇన్ఫ‌ర్మేష‌న్‌కు ప్రొటెక్ష‌న్ కూడా ఉంటుంది.అయితే ఎప్పుడు ఈ కొత్త ఫీచ‌ర్‌ను రిలీజ్ చేస్తారా ఇప్పుడో ఇంకా క్లారిటీ లేదు.కొత్త వ‌ర్ష‌న్స్‌లో దీన్ని రిలీజ్ చేసే అవ‌కాశాలు ఉన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com