ముగ్గురు బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు, 54 మందికి జైలుశిక్ష, బహిష్కరణ

- July 23, 2024 , by Maagulf
ముగ్గురు బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు, 54 మందికి జైలుశిక్ష, బహిష్కరణ

యూఏఈ: యూఏఈలో నిరసనలు నిర్వహించిన ముగ్గురు బంగ్లాదేశీయులకు జీవిత ఖైదు,  54 మందికి జైలు శిక్ష  ఆనంతరం బహిష్కరిస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. బంగ్లాదేశ్‌లో ఉద్యోగ రిజర్వేషన్లపై ఇటీవలి అశాంతి సందర్భంగా తమ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు యూఏఈలో ప్రదర్శన నిర్వహించారు. దేశంలోకి అక్రమంగా ప్రవేశించి నిరసనలో పాల్గొన్నందుకు మరో 53 మందికి కోర్టు 10 ఏళ్లు, ఒక నిందితుడికి 11 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అబుదాబి ఫెడరల్ కోర్ట్ ఆఫ్ అప్పీల్ తీర్పును ప్రకటించింది. జూలై 22న తమ స్వదేశీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యూఏఈలో అనేక వీధుల్లో బంగ్లాదేశీయులు నిరసనలు చేపట్టారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com