Dh150,000 వరకు వడ్డీ లేని వివాహ రుణాలను ప్రకటించిన అబుదాబి..!
- July 24, 2024
అబుదాబి: అబుదాబి సోషల్ సపోర్ట్ అథారిటీ (SSA) ద్వారా అర్హత కలిగిన యూఏఈ జాతీయులకు Dh150,000 వరకు వడ్డీ రహిత రుణాన్ని అందించే 'వివాహ రుణం' కార్యక్రమం ప్రారంభించింది. అబుదాబి కుటుంబ బుక్ కలిగి ఉన్న, ఉద్యోగం చేస్తున్న ఏమిరాతీలు ఈ లోన్‌ను పొందవచ్చు.
రుణం పొందేందుకు షరతులు
-వివాహ సమయంలో భర్తకు కనీసం 21 సంవత్సరాలు మరియు భార్యకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.
-భర్త తప్పనిసరిగా అబుదాబిలో జారీ చేయబడిన కుటుంబ పుస్తకాన్ని కలిగి ఉండాలి.
-దరఖాస్తును భర్త సమర్పించాలి.
-భర్త యొక్క నెలవారీ ఉపాధి ఆదాయం Dh60,000 కంటే తక్కువగా ఉండాలి.
-మెడీమ్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో నమోదు చేసుకోవాలి.
సెప్టెంబర్ 2024 ప్రారంభం నుండి దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభిస్తుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ - అబుదాబి ప్రారంభించిన అబుదాబి ఫ్యామిలీ వెల్‌బీయింగ్ స్ట్రాటజీ మరియు ఎమిరాటీ ఫ్యామిలీ గ్రోత్ ప్రోగ్రామ్‌లో భాగంగా ఈ స్కీమ్ ను అమలు చేస్తున్నారు. అబుదాబి సోషల్ సపోర్ట్ అథారిటీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లా అల్ అమెరి మాట్లాడుతూ.. కుటుంబ ఐక్యత మరియు సామాజిక బంధాలను బలోపేతం చేయడం, పౌరుల మధ్య జనాభా పెరుగుదలను పెంపొందించడం, స్థిరమైన కుటుంబాల ఏర్పాటును సులభతరం చేయడంలో అబుదాబి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







