అబుదాబి - బెంగళూరు కు మరో సర్వీస్ ప్రారంభం.. ఎయిర్ ఇండియా
- July 25, 2024
యూఏఈ: బడ్జెట్ క్యారియర్ ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అబుదాబి - భారత నగరమైన బెంగళూరు మధ్య నేరుగా విమాన సర్వీసును ప్రారంభించింది. 200 కంటే ఎక్కువ వారపు సర్వీసులతో బెంగళూరు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌కు అతిపెద్ద స్టేషన్ గా ఉంది.
బెంగళూరు-అబుదాబి విమాన సర్వీస్ ప్రారంభించడంతో.. అయోధ్య, బాగ్‌డోగ్రా, భువనేశ్వర్, చెన్నై, గోవా, గౌహతి, గ్వాలియర్, హైదరాబాద్, ఇండోర్, జైపూర్, కోల్‌కతా, లక్నో, పూణే, రాంచీ, వారణాసి మరియు విశాఖపట్నం వంటి నగరాల నుండి భారతీయులు ఇప్పుడు యూఏఈ రాజధానికి కనెక్ట్ అయ్యే అవకాశం లభించింది.
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ అబుదాబిని బెంగుళూరు, కన్నూర్, కొచ్చి, కోజికోడ్, మంగళూరు, ముంబై, తిరువనంతపురం మరియు తిరుచిరాపల్లికి నేరుగా విమానాలను నడుపుతోంది. ఇది 17 భారతీయ నగరాలను అబుదాబికి వన్-స్టాప్ ప్రయాణాల ద్వారా కలుపుతుంది. గత వారం, భారతీయ తక్కువ ధర క్యారియర్ ఇండిగో వచ్చే నెల నుండి అబుదాబి నుంచి మంగళూరు, కోయంబత్తూర్ మరియు తిరుచిరాపల్లిలకు నేరుగా విమానాలను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
ఆగస్ట్ 9 నుండి అబుదాబి నుండి మంగళూరు మార్గంలో విమానాలు ప్రతిరోజూ పనిచేస్తాయని, తిరుచిరాపల్లి నుండి అబుదాబికి వారానికి నాలుగు సార్లు ఆగస్ట్ 11నుండి నడుస్తాయి. ఆగస్టు 10 నుంచి కోయంబత్తూర్ యూఏఈ రాజధాని మధ్య ప్రత్యక్ష విమానాలు వారానికి మూడుసార్లు నడుస్తాయని వెల్లడించింది.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







