నవరస నటనా సార్వభౌముడు..!
- July 25, 2024
విలక్షణమైన నటులకు పెట్టింది పేరు తెలుగు చలచిత్ర పరిశ్రమ. నాటి నుండి నేటి వరకు ఎందరో తమదైన నటనా శైలితో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు. అటువంటి వారిలో ముఖ్యులు కైకాల సత్యనారాయణ ఒకరు. నేడు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన జీవిత ప్రయాణం గురించి మీకోసం.
కళలకు పుట్టినిల్లు అనగానే ముందుగా గుర్తుకు వచ్చే పేరు కృష్ణా జిల్లా. ఈ జిల్లా నుండి ఎందరో ప్రముఖులు వెండితెరను ఏలారు. అటువంటి కృష్ణా జిల్లా లోని గుడివాడ దగ్గర్లోని కౌతవరం అనే గ్రామంలో జన్మించారు కైకాల సత్యనారాయణ గారు. విద్యార్థి దశలోనే నటన పట్ల ఆకర్షితుడై పలు నాటకాల్లో నటించారు. ఉన్నత విద్యను పూర్తి చేసిన తర్వాత నటన పట్ల ఉన్న మక్కువతో అవకాశాలు కోసం మద్రాస్ వెళ్లి చిన్న చిన్న వేషాలతో మొదలై క్రమంగా తన దైన నటనా శైలితో ప్రేక్షకులను అలరించారు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అంచెలంచెలుగా ఎదుగుతూ విభిన్నమైన పాత్రలను పోషించి మెప్పించిన సత్యనారాయణ గారు ఆనాటి అగ్రశ్రేణి నటుల కంటే ఎక్కువ పారితోషికం సైతం అందుకున్నారు. హీరోతో సమానంగా పాత్రలు పోషించిన సత్యనారాయణ గారు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ కు మంచి గుర్తింపు రావడంలో కీలకమైన పాత్ర పోషించారు.
కైకాల నటుడిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి అగ్ర కథానాయకులతో అత్యధిక చిత్రాల్లో పనిచేసిన ఏకైక నటుడిగా రికార్డ్ సృష్టించారు. ఎన్టీఆర్ అంటే ప్రత్యేకమైన అభిమానంతో పాటుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో తను సుప్రసిద్ధ నటుడిగా ఎదిగేందుకు ఆయన చేసిన సహాయాన్ని ఎప్పటికి మరిచిపోలేనని పలు సందర్భాల్లో తెలిపారు. తన నటనతో ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్న కైకాల వారు "నవరస నట సార్వభౌమ" అనే బిరుదును సైతం పొందారు.
సత్యనారాయణ గారు నటుడిగానే కాకుండా రాజకీయాల్లో సైతం రాణించారు. నటరత్న ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరి 1996 లో మచిలీపట్నం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. సుమారు 6 దశాబ్దాల సినీ ప్రయాణంలో పరిశ్రమలోని అన్ని వర్గాల వారికి కావాల్సిన వ్యక్తిగా, అజాత శత్రువుగా నిలిచిన సత్యనారాయణ గారు.
- డి.వి.అరవింద్, మాగల్ఫ్ ప్రతినిధి
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







