ఏపీలో మద్యపాన నిషేధం సాధ్యం కాదు – అసెంబ్లీలో తేల్చేసిన పవన్ కల్యాణ్
- July 25, 2024
ఏపీలో మద్యపాన నిషేధం అనేది సాధ్యం కాదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేసారు. గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేశారని..కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటం అడ్డుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో మద్యపాన నిషేధం సాధ్యం కాదని పవన్ పేర్కొన్నారు. అయితే మద్యానికి బానిసలుగా మారారని ప్రజల కోసం 'డీ అడిక్షన్' సెంటర్లను ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పుకొచ్చారు.
రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై వచ్చిన ఆదాయంలో 10 శాతం డీ అడిక్షన్ సెంటర్లు నిర్వహణ కోసం ఉపయోగించాలని సభలో కోరారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో ఎక్సైజ్ శాఖలో దోపిడీ జరిగిందని, వాటిపై సభలో తాము నిలదీస్తే సమాధానం చెప్పాల్సి వస్తుందేమోనన్న భయంతో వైసీపీ నేతలు సభకు రాకుండా తప్పించుకుని పారిపోయారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అనంతరం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి పై స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ లిక్కర్ పాలసీలో జరిగిన అవకతవకలపై సీబీఐ విచారణ చేస్తామని హామీ ఇచ్చారు.
తాజా వార్తలు
- దోహాకు చేరిన భారత కొత్త రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి..
- తమ కార్యకలాపాలను నిలిపివేయాలని టాటా కెమికల్స్‌ను ఆదేశించిన కెన్యా అధ్యక్షుడు
- ఖతార్‌లో భారత తదుపరి రాయబారిగా బాధ్యతలు చేపట్టనున్న డా.శ్రీకర్ రెడ్డి కొప్పుల
- Dh120,000 రుణం చెల్లించాలి..మరో Dh15,000 పరిహారం ఇవ్వాలన్న అబుదాబి కోర్టు
- వాహనదారులకు బిగ్ అలర్ట్..
- ఉపాధ్యాయులందరికి ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు.. సీఎం చంద్రబాబు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!







