కావ్య థాపర్ కూడా ఆ ఇమేజ్ దక్కించుకుంటుందా.?
- July 25, 2024
‘ఏక్ మినీ కథ’ ఫేమ్ కావ్య థాపర్‌కి హీరోయిన్‌గా వుండాల్సిన అన్ని క్వాలిటీస్ పుష్కలంగా వున్నాయ్. కానీ, అవకాశాలే చూసి చూసి వస్తున్నాయ్.
తాజాగా ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా కావ్య థాపర్ దశను మార్చే సినిమా అవుతుందని అంచనా వేస్తున్నారు. నభా నటేష్‌కి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా బ్రేక్ ఇచ్చింది.
అలాగే, ‘డబుల్ ఇస్మార్ట్’తో కావ్య థాపర్’ దశ కూడా తిరిగిపోనుందేమో అనుకుంటున్నారు. ఈ సినిమాలో ఐటెం గాళ్‌కి కూడా ఛాన్సివ్వకుండా తనదైన అందాలతో అలరించేసింది కావ్య థాపర్.
తాజాగా రిలీజ్ అయిన ‘మార్ ముంతా చోడ్ చింతా..’ సాంగ్‌లో కావ్య థాపర్ హాటెస్ట్ గ్లామర్ కుర్రకారుకు ముఖ్యంగా మాస్ ఆడియన్స్‌కి మాస్త్ మసాలా ఫీల్ ఇస్తోంది.
పూరీ సినిమాల్లో పాటలంటే ఆ కిక్కే వేరప్పా.. హీరోయిన్లను హాట్‌గా చూపించడంలోనూ పూరీది అందె వేసిన చేయి. సో, ‘డబుల్ ఇస్మార్ట్’ కావ్య థాపర్‌కి ఖచ్చితంగా బ్రేక్ ఇవ్వడం ఖాయమని నమ్మొచ్చేమో.
ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌లో ఛార్మీ, పూరీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్‌లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్‌లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







