విజయ్ దేవరకొండ న్యూ లుక్ చూశారా.?
- July 25, 2024
రౌడీ స్టార్ కాస్తా ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాతో ఇమేజ్ మార్చుకున్నాడు. కానీ, వర్కవుట్ కాలేదనుకోండి. ‘ప్యామిలీ స్టార్’ సినిమాని సో సోగానే తీసుకున్నారు ఆడియన్స్.
ఎప్పుడయితే ‘లైగర్’ ఫెయిల్యూర్ అయ్యిందో.. ఆ తర్వాత ఎంతగా ప్రయత్నించినా తన మునుపటి వైభవం తెచ్చుకోలేకపోతున్నాడు విజయ్ దేవరకొండ.
‘ఖుషి’, ‘ఫ్యామిలీ స్టార్’ సినిమాలు చేసినప్పటికీ ఆయన ఇమేజ్‌కి పడిన డ్యామేజ్ కంట్రోల్ కాలేదు. ఇక, ఇప్పుడు వరుసగా మూడు ప్రాజెక్టులు లైన్లో పెట్టి వుంచాడు.
అందులో ఒకటి ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో సినిమా. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. లేటెస్ట్గా ఈ సినిమా నుంచి కొన్ని లీకేజ్ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్.
ఈ ఫోటోస్‌లో విజయ్ దేవరకొండ చాలా డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు.
దాంతో, హెయిర్ స్టైల్ నుండీ బాడీ లాంగ్వేజ్ వరకూ అంతా డిఫరెంట్ మేకోవర్‌లో కనిపిస్తున్నాడు. షూటింగ్ స్పాట్ నుంచి లీకైన ఈ ఫోటోలు చూసి గుర్తు పట్టేకుండా మారిపోయాడు విజయ్ దేవరకొండ అంటున్నారు.
ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తుండగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- తొమ్మిది సోషల్ మీడియా ఖాతాల పై చర్యలు..!!
- యూఏఈ లాటరీ కొత్త వీక్లీ ఫార్మాట్ కింద మొదటి లక్కీ డే ఫలితాలు..!!
- మార్బర్గ్ వైరస్ వ్యాప్తి పై సౌదీ ఎంబసీ హెచ్చరిక..!!
- ఒమన్ లో వింటర్ పర్యాటక ప్రమోషన్ ప్రారంభం..!!
- కువైట్ లో డ్రగ్స్ డంప్ బస్ట్..భారీగా డ్రగ్స్ సీజ్..!!
- పలు దేశాధినేతలతో అమీర్ సమావేశం..!!
- సీఎం చంద్రబాబు–నజీర్: పాలన అంశాలపై టాప్ లెవల్ మీటింగ్
- ఉగ్రవాదుల చెరలో తెలంగాణ యువకుడు
- ఫ్లైట్ టికెట్ ధరల పెంపు పై కేంద్రం సీరియస్..
- అత్తలూరి విజయ లక్ష్మి సాహితీ స్వర్ణోత్సవం సందడి







