ఈద్ ఉల్ పితర్పై ఆస్ట్రనామర్స్ అంచనాలు
- June 15, 2016
ఈద్ ఉల్ ఫితర్ ప్రారంభం ఈ ఏడాది, వారాంతానికి కొద్ది రోజుల ముందు జులైలో వచ్చే అవకాశం ఉన్నట్లు ఆస్ట్రనామర్స్ అంచనా వేశారు. దీని కారణంగా కార్మికులకు నాలుగు రోజుల లాంగ్ వీకెండ్ లభించే అవకాశం ఉందని సమాచారమ్. దుబాయ్ సైఫెస్ట్ ఆస్ట్రనమీ గ్రూప్‌కి చెందిన రోహన్ రాబర్ట్స్ అనే ప్రముఖ ఆస్ట్రనామర్, జులై 6 బుధవారం ఈద్ ఉల్ ఫితర్ రావొచ్చునని తెలిపారు. సోమవారం జులై 4వ తేదీన చంద్రుడు పూర్తిగా కనిపించే అవకాశం లేదని, మంగళవారం జులై 5న 1 శాతం చంద్రుడు కనిపించవచ్చని, దాంతో ఈద్ తొలి ప్రారంభం బుధవారం 6 జులై కావొచ్చని ఆయన వివరించారు. టర్కీలో ఈద్‌ని తొమ్మిది రోజులపాటు నిర్వహించనున్నట్లు అధికారికంగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. వాతావరణ మార్పుల కారణంగా ఈద్‌కి సంబంధించి ఒక రోజు అటు ఇటూ ఉండవచ్చు. ఆకాశంలో మేఘాలు ఏర్పడటం, దుమ్ము ధూళి వంటి కారణాలతో ఈ మార్పులు జరుగుతుంటాయి.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







