వేణ్నీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు ..
- June 15, 2016
చల్లగా ఉన్నప్పటికంటే నీళ్లు కాస్త వేడిగా ఉన్నప్పుడు తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలను సొంతం చేసుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దామా..
*
బరువు తగ్గాలనుకునేవారికి ఇవెంతో మేలుచేస్తాయి. వేడినీళ్లు తీసుకోవడం వల్ల శరీర ఉష్ణోగ్రత కొద్దిగా పెరుగుతుంది. దాంతో జీవక్రియారేటూ ఇనుమడిస్తుంది.
*
వేడి నీళ్లూ అధిక ఆకలిని అదుపులో ఉంచుతాయి. ఇవన్నీ బరువుని అదుపులో ఉంచేందుకు ఉపయోగపడతాయి.
*
శరీరాన్ని తాజాగా కనిపించేలా చేయడంతోపాటు యాక్నె వంటి సమస్యలకు వీటితో చుక్కపెట్టొచ్చు. వీటితో చర్మం సాగేతత్వం పెరుగుతుంది. ముడతలు, పొడిచర్మం, నల్లటి వలయాలు వంటివన్నీ అదుపులో ఉంటాయి.
వేడి నీళ్లకు కాస్త తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తీ పెరుగుతుంది.
*
వేడినీళ్లు మీ శరీరంలోని చెడువ్యర్థాలని తొలగిస్తాయి. రాత్రిపూట ఆహారంతోపాటూ గోరువెచ్చని నీళ్లను తీసుకోవడం మంచిది. మసాలా పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగితే చక్కగా జీర్ణమవుతుంది. మలబద్ధకం అదుపులోకి వస్తుంది.
*
జలుబు, దగ్గు వంటి సమస్యలకు పరిష్కారంగానూ వేడినీటిని తీసుకోవచ్చు. శ్వాసకోశ ఇబ్బందుల నుంచి ఉపశమనం ఉంటుంది. ఒళ్లు నొప్పులుగా అనిపించినప్పుడు వేడినీళ్లు తీసుకుంటే రక్తప్రసరణ సక్రమంగా జరిగి ఉపశమనం లభిస్తుంది.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







