సిరియాలో ఘర్షణలు..
- June 15, 2016
సిరియాలోని అలెప్పో ప్రావిన్స్‌లో ప్రభుత్వ అనుకూల వర్గాలు, ఉగ్రవాదులు, రెబల్స్‌కు మధ్య జరిగిన ఘర్షణల్లో 24 గంటల్లో దాదాపు 70 మంది మరణించారు. సిరియా ప్రభుత్వ అనుకూల పోరాటం చేసేవారు రష్యా వైమానిక దాడుల సహాయంతో ఉగ్రవాదుల ఆధీనంలో ఉన్న జేతాన్, ఖాలసా గ్రామాలను తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొచ్చినట్ల సిరియాలో మానవహక్కుల పరిశీలన సంస్థ వెల్లడించింది.
దీంతో సిరియాలో అల్‌ఖైదాకు చెందిన అల్-నుస్రా ఫ్రంట్ అనే ఉగ్రవాద గ్రూపు ప్రభుత్వ మద్దతుదారులపై దాడులు చేసింది. దీంతో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో చాలా మంది చనిపోయారు. జిహాదిస్ట్‌లు, రెబల్స్ దక్షిణ అలెప్పోలోని కొన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ప్రాంతాల్లో గత రాత్రి భారీగా వైమానిక దాడులు జరిగినట్లు సిరియా అబ్జర్వేటరీ వెల్లడించింది. అల్-నుస్రా ఫ్రంట్ ఉగ్రవాదులు లక్ష్యంగా రష్యా వైమానిక దాడులు చేసింది.
తాజా వార్తలు
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్‌లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు







