ఖర్జూర బర్ఫీ
- June 15, 2016
కావలసినవి: ఖర్జూరపళ్లు అర కేజి, చక్కెర 150 గ్రా., పచ్చి కోవా 200 గ్రా., పాలు ఒక కప్పు, డ్రింకింగ్ చాకొలేట్ పౌడర్ ఒక టేబుల్ స్పూను, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, చిన్నగా తరిగిన జీడిపపలు, బాదం పప్పులు కొద్దిగా.
ఎలా చేయాలి
ఖర్జూర పళ్లలో గింజలు తీసివేసి రెండు గంటల పాటు పాలలో నానబెట్టాలి. తర్వాత మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. బాణలిలో నెయ్యిని వేడి చేసి ఖర్జూర మిశ్రమం, చక్కెర వేసి బాగా కలపాలి. చక్కెర కరిగాక పచ్చి కోవా, డ్రై ఫ్రూట్స్ ముక్కలు వేయాలి. ఈ మిశ్రమమంతా దగ్గర పడేవరకు ఆపకుండా కలుపుతూ ఉండాలి. చివర్లో చాకొలేట్ పౌడర్ వేసి బాగా కలిపి కిందికి దించాలి. నెయ్యి పూసిన ప్లేటులో ఈ మిశ్రమాన్ని వేసి సమానంగా సర్దాలి. చల్లారాక ఇష్టమైన విధంగా ముక్కలు కోసుకోవాలి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







