మాటల మాంత్రికుడు..!
- July 30, 2024
ఆయన రాసే డైలాగ్స్ నిత్యం జీవితంలో జరిగే ఘటనలకి సంబంధించినవిగా ఉంటాయి..మాటల రచయిత నుండి స్టార్ డైరెక్టర్ గా ఆయన ఎదిగిన తీరు అందరికీ తెలిసిందే.. పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో జన్మించిన శ్రీనివాస్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం.ఎస్. సి చేశాడు. బంగారు పతకం సాధించాడు. కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేసాడు. సాహిత్యంపై ఉన్న ఆసక్తితో సినిమా రంగంలోకి ప్రవేశించాడు.
హైదరాబాదుకు వచ్చి పోసాని కృష్ణమురళి దగ్గర సహాయకుడిగా చేరాడు. మొదట్లో నటుడు సునీల్ తో కలిసి ఒకే గదిలో ఉండేవాడు. 1999 లో స్వయంవరం సినిమా ద్వారా మాటల రచయితగా సినీ రంగ ప్రవేశం చేసాడు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మథుడు వంటి సినిమాలకు కథ, స్క్రీన్‌ప్లే రచయితగా, అతడు, జులాయి, అత్తారింటికి దారేది వంటి సినిమాలకు దర్శకునిగా తెలుగు సినిమా రంగంలో పేరుపొందాడు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ అసలు పేరు ఆకెళ్ళ నాగశ్రీనివాస్ శర్మ. 1971 నవంబరు 7 వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో ఆకెళ్ల ఉదయ భాస్కరరావు, నరసమ్మలకు దంపతులకు జన్మించాడు. భీమవరంలోని డి.ఎన్.ఆర్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ పూర్తి చేసారు. ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అణుకేంద్ర శాస్త్రంలో ఎం. ఎస్. సి పూర్తి చేసుకుని స్వర్ణ పతకం సాధించాడునువ్వే కావాలి, చిరునవ్వుతో, నువునాకు నచ్చావ్, మల్లీశ్వరి, మన్మధుడు, జై చిరంజీవా లాంటి సినిమాలకి డైలాగ్స్ రాశారు. పంచ్ లు అంటే ఇలాపేలాలి అనేలా యువ రచయితలకు దిశానిర్దేశం చేసారు త్రివిక్రమ్. పేరాలకు పేరాలు రాసేసి పేల్చేయనవసరంలేదు. జస్ట్ వన్ లైన్ పంచింగ్ తో అందరినీ అలరించటం త్రివిక్రమ్ సొంతం.
నిజ జీవితంలో సంఘటనలోనుంచి, వాస్తవ జీవితాన్నుంచే మాటలను ఒడిసి పట్టి వాటిని వెండితెరపై పలికిస్తాడు. అందమైన విజువల్స్‌తో, ఆలోచింపజేసే మాటలతో, ఆకట్టుకునే అనుబంధాలతో సినిమా రూపంలో సిల్వర్ స్క్రీన్‌పై ఆవిష్కరించి ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేయడంలో త్రివిక్రమ్ కి లేరు ఎవరు సాటి.అయితే రైటర్స్.. డైరెక్టర్స్ అవ్వడం చాలా కామన్. కథను ఎలా మలుపు తిప్పాలి, కథనానికి ఏ మలుపు దగ్గర మెలికపెట్టాలి, ఇంటర్వెల్ బ్యాంగ్ ఎంత ఎఫిక్టివ్ గా ఉండాలి, హీరోయిజాన్ని ఎంత హైప్ కి తీసుకెళ్లాలి వంటి కమర్షియల్ ఫార్ములాస్‌ని బాగా వంట బట్టించుకున్నాడు. అతడుతో త్రివిక్రమ్ అంటే అందరికీ ఓ బెంచ్ మార్క్ ఏర్పడింది.
టాలీవుడ్ స్టార్ హీరోలందరితో సినిమాలు చేశాడు.. మహేష్ బాబుతో రెండు, అల్లు అర్జున్‌తో మూడు, పవన్ కల్యాణ్ తో మూడు సినిమాలు చేసిన త్రివిక్రమ్, ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు సన్నద్ధమవుతున్నాడు. మరోవైపు పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమాలకి మాటలు అందిస్తున్నాడు.త్రివిక్రమ్, పవన్ మంచి స్నేహితులు. వీరిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉంటాయి. బాగా పుస్తకాలు చదువుతారు. పవన్ ఏం చేయాలన్నా త్రివిక్రమ్ సలహాలు తీసుకుంటారని టాక్. హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా త్రివిక్రమ్ తన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- హోర్ముజ్ జలసంధిలో సురక్షిత నౌకాయానానికి ఒమన్–ఇరాన్ చర్చలు
- ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్లకు గౌరవం..
- ఏపీ లోకాయుక్తగా ప్రమాణ స్వీకారం చేసిన మల్లిఖార్జునరావు
- గుడివాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సీటీ స్కాన్, సోలార్ పవర్ ప్రారంభం
- దుబాయ్‌లో వీసాల పేరుతో మోసాలు..నకిలీ ప్రకటనల పై పోలీసుల హెచ్చరిక
- ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలను వణికిస్తున్న ‘H1N1′ వైరల్
- దుబాయ్‌లో ఘనంగా ఎంపీ ధర్మపురి అర్వింద్ జన్మదిన వేడుకలు
- 3డీ ప్రింటింగ్ కోసం ఫార్మాస్యూటికల్ పాలిమర్ ఆధారిత బయోఇంక్ అభివృద్ధి చేసిన బిట్స్ పిలానీ గో
- ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదినం సందర్భంగా UAE నేతల శుభాకాంక్షలు...
- రాయదుర్గంలో సుజ్లాన్ ప్రాజెక్టుకు మంత్రి లోకేష్ శంకుస్థాపన







