క్లాష్‌పై క్లారిటీ ఇచ్చిన ‘మిస్టర్ హరీష్ శంకర్’.!
- July 30, 2024
సోలో రిలీజ్ అంటూ పండగ చేసుకున్నాడు మొదట ‘డబుల్ ఇస్మార్ట్ శంకర్’. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎప్పుడయితే ‘పుష్ప 2’ వాయిదా పడిందో, ముందూ వెనకా ఆలోచించకుండా వెంటనే ఆ డేట్‌ని లాక్ చేసుకున్నాడు ఇస్మార్ట్ శంకర్.
అప్పటికి మరే సినిమా ఆ డేట్లో రిలీజ్‌కి లేదు. దాంతో సోలో రిలీజ్ ‘డబుల్ ఇస్మార్ట్’దే.. అది కూడా ప్రైమ్ టైమ్ అనుకున్నారు. తమకి బాగా కలిసొచ్చే అంశమే అనుకుని సంబరపడ్డారు. కానీ, ఆ సంబరం ఎంతో కాలం నిలవలేదు.
భారీ అంచనాల నడుమ ‘మిస్టర్ బచ్చన్’ ఆ డేట్లోకి వచ్చి కూర్చుంది. దాంతో డైరెక్టర్ హరీష్ శంకర్‌ని ట్రోల్ చేస్తున్నారు రామ్ అండ్ పూరీకి చెందిన ఓ వర్గం ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా.
దాంతో, సోషల్ మీడియాలో తనదైన శైలిలో క్లారిటీ ఇచ్చాడు హరీష్ శంకర్. ఈ క్లాష్ కావాలని వచ్చింది కాదు. రావల్సి వచ్చింది. అందుకు పూరీ జగన్నాధ్ మరియు రవితేజలతో మాట్లాడాం.. అయినా డైరెక్టర్‌గా పూరీ జగన్నాధ్ స్థాయి వేరు. స్థానం వేరు.. ఆయన సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.. అలాగే నా సినిమా కూడా.. అన్నట్లుగా క్లారిటీ ఇచ్చారాయన.
టెక్నికల్ టీమ్ అండ్ ప్రొడ్యూసర్స్ ఇంకా ఇతరత్రా కారణాల వల్ల అదే డేట్‌కి రావల్సి వచ్చింది. ముందుగా అనుకోలేదు. ఆ డేట్ అనుకున్న తర్వాత టీమ్ చాలా కష్టపడాల్సి వచ్చింది. అప్పటికప్పుడు పనులు వేగవంతం చేయాల్సి వచ్చింది.. అంటూ తమ కష్టాన్ని తెలియజేసే ప్రయత్నం చేశారాయన. అయినా కంటెంట్ బాగుంటే ఆటోమెటిగ్గా సినిమా హిట్టవుతుంది. ఎంత పోటీ వున్నా సరే.!
తాజా వార్తలు
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!







