వింటేజ్ లుక్స్‌లో ‘రాజా సాబ్’ రొమాన్స్.! కానీ.!
- July 30, 2024
ప్రబాస్ - మారుతి కాంబినేషన్ మూవీ ‘రాజాసాబ్’కి సంబంధించి తాజాగా ఓ గ్లింప్స్ రిలీజ్ చేశారు. గ్లింప్స్‌లో వింటేజ్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు ప్రబాస్. ప్రబాస్‌ని అలా చూసిన ఫ్యాన్స్ ఖుషీకీ అవధుల్లేవ్.
ఫ్లవర్ బొకే పట్టుకుని మెరూన్ కలర్ సూట్లో ఓ వింటేజ్ కారు అద్దంలో తన ముఖాన్ని చూసుకుంటున్న ప్రబాస్ హ్యాండ్సమ్ లుక్స్‌కి అమ్మాయిలు ఫిదా అవుతున్నారు.
రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్గా రూపొందుతోంది ఈ సినిమా.. అంటూ గ్లింప్స్ చివరిలో కాన్సెప్ట్ గురించి పక్కాగా ఐడియా ఇచ్చేశారు.
అలాగే, సినిమా రిలీజ్ డేట్ విషయంలోనూ లీడ్ వదిలారు. సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ ఇంతవరకూ ప్రచారం జరిగింది. కానీ, లేటెస్ట్ అప్డేట్లో ఏప్రిల్ 2025 అంటూ రిలీజ్ డేట్ ప్రకటించారు.
గ్లింప్స్ అదిరిపోయింది కానీ, చివరికొచ్చేసరికి ఫ్యాన్స్ గుండె బద్దలైపోయింది. సంక్రాంతికే తమ రాజాసాబ్‌ని చూసేస్తామనుకున్న ఫ్యాన్స్‌కి ఆశలన్నీ అడియాశలైపోయాయ్. ఏప్రిల్ వరకూ ఎదురు చూపులు తప్పవని డిజప్పాయింట్ అవుతున్నారు.
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







