‘మెకానిక్ రాఖీ’గా విశ్వక్ సేన్.!
- July 30, 2024
మొన్నీ మధ్యనే ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు హీరో విశ్వక్ సేన్. నిన్నేమో ‘లైలా’ అనే డిఫరెంట్ మూవీని అనౌన్స్ చేశాడు ఇంట్రెస్టింగ్ ఫస్ట్‌లుక్‌తో సహా.
ఇప్పుడేమో ‘మెకానిక్ రాఖీ’ అంటూ తన కొత్త సినిమా టీజర్ రిలీజ్ చేశాడు. రవితేజ అనే కొత్త డైరెక్టర్ ఈ సినిమాతో పరిచయమవుతున్నాడు. మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాధ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు ఈ సినిమాలో. టీజర్ విషయానికి వస్తే, పక్కా మాస్ యాంగిల్‌లో కట్ చేశారు.
మెకానిక్ పాత్రలో విశ్వక్ సేన్ నటిస్తున్నాడీ సినిమాలో. కొన్ని యాక్షన్ బ్లాక్స్‌తో పాటూ, హీరోయిన్లతో క్యూట్ రొమాంటిక్ సన్నివేశాలు కూడా చూపించారీ టీజర్‌లో. అక్కడక్కడా హిందీ డైలాగులు కూడా వున్నాయ్. ఓవరాల్‌గా ఈ టీజర్ ఆకట్టుకుంటోంది. మంచి రెస్పాన్స్ అందుకుంటోంది కూడా.
రిలీజైన కొన్ని నిమిషాల్లోనే ట్రెండింగ్ అయ్యింది. ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమాతో యావరేజ్ హిట్ అందుకున్న విశ్వక్ సేన్ రాబోయే సినిమాలతో అందులోనూ ఈ ‘మెకానిక్ రాఖీ’తో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి మరి.
తాజా వార్తలు
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్‌మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్‌పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!
- కువైట్ లో 28 ఏళ్ల తర్వాత కేరళ సీం విజయన్..!!
- మదీనాలో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు అరెస్ట్..!!
- ఖతార్ లో సీజనల్ వెజిటేబుల్ మార్కెట్లు ప్రారంభం..!!
- ఫోన్ చార్జర్ వాడకంపై ప్రభుత్వం సూచనలు







