చిన్మయీ.! ఫ్రీడమ్ వుంది కదా.. అని నోటికెంతొస్తే.. అంత వాగితే కుదరదమ్మా.!

- July 30, 2024 , by Maagulf
చిన్మయీ.! ఫ్రీడమ్ వుంది కదా.. అని నోటికెంతొస్తే.. అంత వాగితే కుదరదమ్మా.!

సింగర్ కమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన చిన్మయికి సోషల్ మీడియాలో బోలెడంత ఫాలోయింగ్ వున్న మాట వాస్తవమే. కానీ, ఫాలోయింగ్ వుంది కదా.. ఏది మాట్లాడినా చెల్లిపోతుంది.. మాట్లాడే ఫ్రీడమ్ వుంది కదా.. సోషల్ మీడియా వేదికగా ఏ మెసేజ్ అయినా పాస్ చేసేస్తాను.. అనుకునే వర్గానికి చెందిన అతి కొద్ది మంది సెలబ్రిటీల్లో చిన్మయి ముందు వరసలో వుంటుంది.

గతంలోనూ ఆమె ట్వీట్లు అనేక రకాలుగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. తాజాగా తండ్రీ కూతురు రిలేషన్‌షిప్ విషయమై ఆమె వేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపుతోంది. అత్యంత జుగుప్సకరమైన మెసేజ్ పాస్ చేసినట్లయ్యింది ఆమె వేసిన ట్వీట్‌తో.

రెండేళ్ల కూతురిని తండ్రి కౌగిలించుకోవాలంటే ఖచ్చితంగా ఆ రెండేళ్ల పాప అనుమతి తీసుకోవాలన్నదే ఆమె ట్వీట్ సారాంశం. తన రెండేళ్ల కూతురిని తన భర్త, బిడ్డ తండ్రి (రాహుల్ రవీంద్రన్) హగ్ చేసుకోవడానికి అనుమతి అడిగాడట. ఆ పాప నో చెప్పగానే మానేశాడట. అందరు తండ్రులూ అలాగే వుండాలా.?

అసలు రెండేళ్ల పాపకి ఏం ఎమోషన్ తెలుస్తుంది.? ఈ విషయమై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది. ఎంతో మంది తండ్రులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తల్లులు కూడా ఈ ట్వీట్‌ని, చిన్మయిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఓ సెలబ్రిటీగా ఇలాంటి ట్వీట్లు పాస్ చేస్తూ సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నట్లు.? అయినా తన పాప నో అన్నదని ఆ మెసేజ్‌ని యూనివర్సలైజ్ చేసి మాట్లాడడం ఎంతవరకూ సబబు.? చిన్మయి లాంటి వాళ్లకు ఎలా బుద్ధి చెబితే దారిలోకొస్తారు.?

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com