పారిస్ ఒలింపిక్స్‌లో సింధు దూకుడు..

- July 31, 2024 , by Maagulf
పారిస్ ఒలింపిక్స్‌లో సింధు దూకుడు..

పారిస్: రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు పారిస్ ఒలింపిక్స్‌లో అద‌ర‌గొడుతోంది. వ‌రుస‌గా రెండో గేమ్‌లోనూ విజ‌యం సాధించింది తెలుగు తేజం. బుధ‌వారం ఎస్తెనియా ప్లేయ‌ర్ క్రిస్టిన్‌ కూబాపై గెలుపొందింది.ఈ గెలుపుతో సింధు ప్రిక్వార్ట‌ర్స్‌(రౌండ్‌-16)కు దూసుకువెళ్లింది. పారిస్ ఒలింపిక్స్‌లో 10వ సీడ్‌గా ఉన్న సింధు, 73వ ర్యాంక్‌లో ఉన్న క్రిస్టిన్ కూబా పై 21-15, 21-10 తేడాతో విజ‌యాన్ని అందుకుంది.

ఈ మ్యాచ్ కేవ‌లం 34 నిమిషాల్లోనే ముగియ‌డం గ‌మ‌నార్హం.సింధుకు తొలి గేమ్‌లో క్రిస్టిన్ ఏ మాత్రం పోరాటం ఇవ్వ‌లేక‌పోయింది. అయితే..రెండో రౌండ్‌లో మాత్రం కాస్త ప్ర‌తిఘ‌టించింది. ఆదివారం అబ్దుల్ రజాక్ ఫాతిమాపై సింధు గెలిచిన సంగ‌తి తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com