ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మహిళపై అఘాయిత్యం..ఇద్దరు డైవర్ల అరెస్ట్
- July 31, 2024
హైదరాబాద్: నడుస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సులో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో నిందితులను అరెస్ట్ చేశామని హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నెల్లూరుకి చెందిన ఈర్ల కృష్ణబాబు, ప్రకాశం జిల్లాకు చెందిన సిద్దయ్య అనే ఇద్దరు డ్రైవర్లను అరెస్టు చేసినట్టు చెప్పారు. కృష్ణబాబు బాధితురాలిపై అఘాయిత్యానికి పాల్పడగా, సిద్దయ్య అతడికి సహకరించాడని వెల్లడించారు. యాచారం స్టేషన్ పరిధిలో నిందితులను అరెస్టు చేశామని, వీరిపై 64 (1) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేశామన్నారు.
”బాధితురాలు తన కూతురితో కలిసి హరికృష్ణ ట్రావెల్స్ బస్సు ఎక్కింది. అయితే ఒకే బెర్త్ బుక్ చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న కృష్ణబాబు.. ఆమెతో మాటలు కలిపాడు. వెనకాల ఖాళీగా ఉన్న బెర్త్ లో పడుకోవాలని ఆమెకు సూచించారు. చేగుంటలో భోజనం చేసిన తరువాత సిద్దయ్య డ్రైవ్ చేశాడు. ప్రయాణికులు అందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో అదునుచూసి మహిళపై కృష్ణబాబు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించాం. బాధితురాలి భర్త 7 ఏళ్ల క్రితం మరణించాడ”ని డీసీపీ బాలస్వామి తెలిపారు.
కాగా, హరికృష్ణ ట్రావెల్స్ బస్సు.. నిర్మల్ నుంచి ప్రకాశం జిల్లాకు వెళుతుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తనపై కృష్ణబాబు బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్టు బాధిత మహిళ ఆరోపించింది. అయితే బాధిత మహిళ చేసిన ఆరోపణలపై తోటి ప్రయాణికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో ‘శ్రావణం 2026’ షెడ్యూల్.. ఘనంగా ఓణం వేడుకలు..!!
- మెడికల్ ఎమర్జెన్సీ.. దోహా–బెంగళూరు ఇండిగో విమానం మస్కట్‌కు మళ్లింపు..!!
- రెండో EU–GCC సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం..!!
- ఖతార్ లో పబ్లిక్ ప్రాసిక్యూషన్–స్టేట్ ఆడిట్ బ్యూరో మధ్య కీలక ఒప్పందం..!!
- యూఏఈలో అక్టోబర్ హాఫ్‌టర్మ్ సెలవులు ముందుకు.. పేరెంట్స్ అసంతృప్తి..!!
- కువైట్‌లో డీజిల్ చోరీ.. 41 మంది అరెస్ట్..!!
- ఉద్యోగుల సోషల్ మీడియా అకౌంట్లపై కేంద్రం ఫోకస్
- President of Senegal receives Al Zeyoudi in Dakar to discuss expanding trade and investment partnership
- యువత కోసం ట్రావెల్-ఫస్ట్ డిజిటల్ కార్డు
- ఢిల్లీలో భారీ వర్షాలు..ఎయిర్‌పోర్ట్‌లో వరద నీరు







