న్యాయవ్యవస్థను కాపాడేందుకు కలిసికట్టుగా పనిచేద్దాం: కేటీఆర్
- August 02, 2024
హైదరాబాద్: రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమిష్ఠిగా కలిసి పని చేయాలని మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) సూచించారు. శుక్రవారం శాసనసభలో మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టిన సివిల్ కోర్టుల సవరణ బిల్లుపై ఆయన చర్చను ప్రారంభించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లును సమర్థిస్తూ, స్వాగతిస్తున్నట్లు తెలిపారు. రాజకీయంగా విబేధాలు ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థను కాపాడేందుకు సమిష్ఠిగా కలిసి పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో సైబర్ నేరాలు, అత్యాచారాలు, హత్యలు విపరీతంగా పెరిగాయని ఆరోపించారు. ‘అత్యాచారాలు చేసిన వారికి త్వరగా శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి. అత్యాచారాలు, సైబర్‌క్రైమ్‌పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయాలి. బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుందనే భరోసా ఇవ్వాలి.’ అని కేటీఆర్ అన్నారు. కేంద్ర కొత్తగా తీసుకొచ్చిన చట్టాలపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరేంటో చెప్పాలని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. కేంద్రం తెచ్చిన చట్టాలతో రాష్ట్రానికి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందన్నారు. భావవ్యక్తీకరణ స్వేచ్ఛను హరించే చట్టాలు తేవడం మంచిది కాదని చెప్పారు. కొత్త చట్టాల వల్ల తెలంగాణను పోలీసు రాజ్యంగా మారుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయన్నారు.‘ కేంద్రం తెచ్చిన కొత్త చట్టాలను కర్ణాటక, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మార్పులు చేర్పులు చేశాయి. ఈ చట్టాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకోవాలి’ అని కేటీఆర్ సూచించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







