ఆస్ట్రేలియా పై భారత్ విజయం
- August 02, 2024
పారిస్: పారిస్ ఒలింపిక్స్ గ్రూప్ చివరి మ్యాచ్‌లో భారత హాకీ జట్టు గెలుపొందింది. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో 3-2 తేడాతో విజయ ఢంకా మోగించింది. 1972 నుంచి ఇప్పటివరకు ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాను భారత్ ఓడించడం ఇదే మొదటిసారి. పూల్ బీ నుంచి భారత్‌తో పాటు బెల్జియం, ఆసీస్ క్వార్టర్స్‌కు చేరుకున్నాయి.
కాగా, గత టోక్యో ఒలింపిక్స్‌లోనూ భారత పురుషుల హాకీ జట్టు కాంస్య పతకం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గేమ్స్ లోనూ ఓ పతకాన్ని పక్కాగా తన ఖాతాలో వేసుకునే దిశగా భారత హాకీ జట్టు దూసుకు వెళ్తుంది. ఇప్పటికే గ్రూప్ బీలో వరుసగా మూడు మ్యాచులు గెలిచిన విషయం తెలిసిందే.
మొదట్లో న్యూజిలాండ్‌పై విజయం సాధించిన భారత్ అనంతరం అర్జెంటీనాతో మ్యాచును డ్రాగా ముగించింది. గత మంగళవారం జరిగిన మ్యాచులో ఐర్లాండ్‌పై గెలిచింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ అద్భుత ప్రదర్శనతో జట్టును విజయ తీరాలకు చేర్చుతున్నాడు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







