డయాబెటిస్ వున్నవాళ్లు గోంగూరను తినొచ్చా.!
- August 03, 2024
వర్షా కాలంలో తాజా తాజా గోంగూర టెంప్ట్ చేస్తుంటుంది. అయితే గోంగూరను షుగర్ వ్యాధిగ్రస్తులు తింటే చాలా ప్రమాదమన్న అపోహ వుంది. కానీ, అది కేవలం అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.
గోంగూర తింటే రక్తంలోని చక్కెర స్థాయులు అదుపులో వుంటాయ్. సో, షుగర్ వ్యాధిగ్రస్తులు ఏమాత్రం అనుమానం లేకుండా గోంగూరను తినొచ్చని అంటున్నారు. అంతేకాదు, గోంగూరలోని యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని రక్షిస్తాయ్.
అలాగే, గుండె జబ్బులు దరి చేరనీయకుండా చేస్తాయ్. ఫైబర్ కంటెంట్ ఎక్కువ. సి విటమిన్ ఎక్కువగా వుంటుంది. రోజూ గోంగూరను తినే వారిలో రోగ నిరోధక శక్తి మెరుగవుతుందని చెబుతున్నారు.
అంతేకాదు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వుండడంలో జీర్ష సంబంధిత వ్యాధులు దరి చేరకుండా. జీర్ణ వ్యవస్థ మెరుగయ్యేందుకు తోడ్పడుతుంది.
ఎర్ర రక్త కణాల వృద్ధిలోనూ గోంగూరలోని పోషకాలు చాలా తోడ్పడతాయ్. కాల్షియం కూడా అధికంగా వుండడం వల్ల ఎముకలు, దంతాల ఆరోగ్యానికి గోంగూర సహాయం చేస్తుంది. ఇంకెందుకాలస్యం.. ఎలాంటి మొహమాటం లేకుండా నోరూరించే గోంగూరను ఇష్టమైన రీతిలో వండి కడుపారా లాగించేయండిక.
తాజా వార్తలు
- హైదరాబాద్లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- DP World to develop strategic border facilities in Afghanistan under landmark agreement
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్
- అసలైన లెక్క మొదలుకాబోతుంది: సీఎం రేవంత్
- ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో
- వెంకప్ప భాగవతులకు ‘బెస్ట్ ఫిలాంత్రఫీ అవార్డు’
- పవన్ కళ్యాణ్ కు అరుదైన బిరుదు
- నార్కొటిక్స్ ప్రమోటింగ్ చేస్తే..భారీ జరిమానాలు, జైలుశిక్ష..!!







