అబాసు పాలవుతున్న ‘దేవర’.! కొంచెం చూసుకోవక్కర్లా.!

- August 03, 2024 , by Maagulf
అబాసు పాలవుతున్న ‘దేవర’.! కొంచెం చూసుకోవక్కర్లా.!

కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీయార్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. గ్లోబల్ స్టార్ గుర్తింపు తర్వాత ఎన్టీయార్ ఆచి తూచి నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా స్టార్ట్ చేయడానికే బోలెడంత తలమునకలయ్యారు టీమ్.
పట్టాలెక్కడానికే సినిమా చాలా టైమ్ తీసుకుంది. ఎట్టకేలకు పట్టాలెక్కింది. కష్టపడి గ్లింప్స్ రిలీజ్ చేశారు. జస్ట్ ఓకే అనే రెస్పాన్స్.. ఆ తర్వాత ‘దేవర ముందర నువ్వెంత..’ అనే ఓ ఆడియో సింగిల్ రిలీజ్ చేశారు.
ఇందులో ఎన్టీయార్ కన్నా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ చేసిన ఓవరాక్షనే ఎక్కువయ్యిందన్న ట్రోల్స్ వినిపించాయ్. ఇక  వెరీ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన పోస్టర్ మరిన్ని ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
స్టిల్ అయితే బాగుంది. హీరోయిన్‌ జాన్వీ కపూర్‌తో హీరో జూనియర్ ఎన్టీయార్  రొమాంటిక్‌గా వున్న స్టిల్ అది. బాగానే వుంది. నిజానికి అయితే, రెస్పాన్స్ అదిరిపోవాలి. కానీ, ఈ స్టిల్‌లో సింపుల్‌గా తప్పులు దొర్లేశాయ్. దాంతో, దారుణంగా ట్రోల్స్ వినిపిస్తున్నాయ్.
ఏమాత్రం బడ్జెట్ లేని, జస్ట్ ఫోన్‌లో అందుబాటులో వున్నయాప్స్‌తోనే ఎటువంటి టెక్నికల్ నాలెడ్జ్ లేని వాళ్లే ఎంతో బాగా ఫోటోస్ ఎడిట్ చేస్తున్నారు. అలాంటిది గ్లోబల్ స్టార్ సినిమా పోస్టర్. భారీ బడ్జెట్.. కొరటాల శివ వంటి డైరెక్టర్.. ఇంత మంది వుండీ ఈ స్టిల్‌ని పర్‌ఫెక్ట్‌గా ఎడిట్ చేయలేకపోయారు. బ్యాక్ గ్రౌండ్ర‌లో చాలా క్లియర్‌గా తప్పులు కనిపిస్తున్నాయ్. ఇలాగయితే ఎలా ‘దేవర’. ఇంత నిర్లక్ష్యమా.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com